విజయవంతంగా 100వ బ్యాచ్‌ పరకామణి సేవ

విజయవంతంగా 100వ బ్యాచ్‌ పరకామణి సేవ

తిరుమల, 28 జూలై  2013 : తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీ కానుకలను లెక్కించేందుకు, 2012 ఆగస్టు 17వ వతారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పరకామణి సేవ శ్రీవారి ఆశీస్సులతో విజయవంతంగా కొనసాగుతూ 99 బ్యాచ్‌లు సమర్థవంతంగా పరకామణిసేవను పూర్తి చేసుకొని 100వ బ్యాచ్‌లో ఆదివారంనాడు ప్రవేశించింది.

తి.తి.దే యాజమాన్యం పరకామణిలో శ్రీవారి సేవకుల అవసరాన్ని గుర్తించి ప్రారంభించిన పరకామణి సేవ అనతికాలంలోనే ప్రసిద్ధి పొందింది. తి.తి.దే అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా సేవలందిస్తూ ముందుకు సాగుతున్నది. తొలుత బ్యాచ్‌కు 50 మందితో ప్రారంభమైన ఈ సేవ అనతి కాలంలోనే సాధించిన ఫలాల దృష్ట్యా తి.తి.దే యాజమాన్యం సేవకుల సంఖ్యను ప్రస్తుతం 80 మందికి పెంచింది. ఇప్పటి వరకు 4579 మంది సేవకులు 99 బ్యాచ్‌లకుగాను పాల్గొని విశేషసేవలందించారు. ఆదివారం నాడు 100వ బ్యాచ్‌ సేవలందించడానికి సంసిద్ధమైంది.
ఇప్పటి వరకు పరకామణి సేవలో పాల్గొన్న సేవకుల వివరాలు
ఆంధ్రప్రదేశ్‌  నుండి 3706
కర్ణాటక రాష్ట్రం నుండి 439
తమిళనాడు రాష్ట్రం నుండి 410
కేరళ రాష్ట్రం నుండి 24 మొత్తం 4579
ఇతర వివరాలు
ప్రస్తుతం పనిచేయువారు విశ్రాంత ఉద్యోగులు మొత్తం
ప్రభుత్వ ఉద్యోగులు 2256 647 2903
ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఉద్యోగులు 413 83 495
బ్యాంకు ఉద్యోగులు 462 310 772
ఇన్సూరెన్సు ఉద్యోగుల 354 55 409
మొత్తం 3485 1094 4579
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.