SUPREME COURT CHIEF JUSTICE AND AP HIGH COURT CHIEF JUSTICE  OFFERS PRAYERS AT TIRUMALA TEMPLE _ శ్రీవారిసేవలో తరించిన సుప్రీం, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు

TIRUMALA, June 17:  Honourable Chief Justice Of Supreme Court Justice P.Sathasivam accompanied by his wife Smt.  Saraswathi Sathasivam Hon’ble Chief Justice of AP High Court Justice Sri  Kalyan Jyoti Sengupta offered prayers in the hill shrine of Lord Venkateswara on Sunday morning.
 
On his arrival, the Hon’ble Chief Justice of Supreme Court and Chief Justice of AP High Court and his entourage were accorded a grand reception by the temple priests with traditonal Isthikapal amidst the chanting of vedic hymns and the TTD Chairman Sri K.Bapi Raju, and TTD EO Sri MG Gopal escorted him to the sanctum sanctorum.
 
Inside the sanctum sanctorum, one of the chief priests of Tirumala temple Sri AV Ramana Dikshitulu explained to the Hon’ble Chief Justice of India and AP about the significance of Lord and the jewels adorned to the presiding deity. The Chief Justices spent few minutes praying before the presiding deity of Lord Venkateswara and later reached Ranganayakula Mandapam where he was accorded Vedasirvachanam by temple priests.
 
TTD Board Chairman Sri Kanumuru Bapiraju offered the President, Lord’s silk vastram, prasadams while TTD EO Sri MG Gopal presented a lamination of Lord Venakteswara and Goddess Padmavathi.
 
Hon’ble Judge of High Court Justice Sri N.V.Ramana, CVSO Sri GVG Ashok Kumar, District Judge Sri Ravi Babu, Addl CVSO Sri Sivakumar Reddy, Reception Officials Sri Venkataiah, Sri Damodar and others were present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 

శ్రీవారిసేవలో తరించిన సుప్రీం, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు

తిరుమల, 28 జూలై  2013 : తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం ప్రముఖుల విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ పి.సదాశివం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్త కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

తి.తి.దే ఛైర్మెన్‌ శ్రీ కనుమూరి బాపిరాజు, ఇ.ఓ శ్రీ యం.జి.గోపాల్‌ స్వాగతం పలికారు. అనంతరం అర్చకస్వాములు మహాద్వారం చెంత ఇస్తికఫాల్‌ సంప్రదాయక స్వాగతం పలికారు. ఆనంతరం ప్రధాన న్యామూర్తులిరువురు శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అటు తరువాత రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రధాన న్యాయమూర్తులకు, వారి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రాలను, లడ్డూ తీర్థ ప్రసాదాలు, శ్రీవారి ఫోటో మరియు ఆధ్యాత్మిక దేవస్థానం ప్రచురణలను తి.తి.దే చైర్మన్‌ కనుమూరి బాపిరాజు, ఇ.ఓ యం.జి గోపాల్‌ వారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌. శ్రీనివాసరాజు, సి.వి.ఎస్‌.ఓ శ్రీ అశోక్‌కుమార్‌, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ, తి.తి.దే ఉన్నతాధి కారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అనంతరం ప్రధాన న్యాయమూర్తులు పెద్దజీయంగార్‌ మఠంలో జీయంగర్‌ స్వాముల ఆశీర్వాదం పొందారు. అటు తరువాత అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి తమ మ్రొక్కు తీర్చుకున్నారు. వీరి వెంట హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఎన్‌.వి.రమణ, ఇతర జిల్లా న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.