CM INVITED FOR VIZAG TEMPLE KUMBHABHISHEKAM _ విశాఖపట్నం లో శ్రీవారి ఆలయ కుంభాభిషేకానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం

Tirupati, 15 Mar. 22: As the Sri Venkateswara temple at Visakhapatnam is completed and ready for opening, TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Dr KS Jawahar Reddy has invited the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy for Maha Kumbhabhishekam on Tuesday at CM’s office in Assembly.

Veda Pundits also rendered Vedaseervachanam to the CM on the occasion.

Honourable Endowments Minister of AP Sri Vellampalli Srinivas is also present.

DyEO General Sri Ramana Prasad also participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

విశాఖపట్నం లో శ్రీవారి ఆలయ కుంభాభిషేకానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం

తిరుపతి 15 మార్చి 2022: విశాఖపట్నం లో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ కుంభాభిషేకానికి హాజరు కావాలని కోరుతూ మంగళవారం టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెలం పల్లి శ్రీనివాస్, టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.

శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వీరు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలసి ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.
డిప్యూటి ఈవో శ్రీ రమణ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది