MAHA SAMPROKSHANAM IN VIZAG TEMPLE _ మార్చి 18 నుండి 23వ తేదీ వ‌ర‌కు విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ

Tirupati, 15 March 2022: The Maha Samprokshana fete in SV temple at Vizag will be observed from March 18-23 with a series of religious events.

On March 23, Vigraha Pratista and Maha Samprokshanam will be observed between 9am and 11:30am.

On March 18 Ankurarpana, March 19 Vedic rituals like Bimba Suddhi, Panchagavyadhivasam, Kalasa Sthapana, Kumbhavahanam, Kumbharadhana will be performed.

On March 20, 21 and 22 these Yaga programs will continue and on March 23, Maha Purnahuti will be observed followed by Maha Samprokshanam between 9.50am and 10.20am in the auspicious Vrishabha Lagnam.

In the evening Kalyanotsavam will be performed between 3pm and 4:15pm followed by Dhwajavarohanam in the night.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 18 నుండి 23వ తేదీ వ‌ర‌కు విశాఖ‌లో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ

తిరుపతి, 2022 మార్చి 15: విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు మార్చి 18 నుండి 23వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. మార్చి 23వ తేదీన‌ ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌, మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 18వ తేదీన శుక్ర‌వారం రాత్రి 7 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 19న శ‌నివారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు య‌గాశాలవాస్తు, పంచ‌గ‌వ్య్ర‌పాశ‌నం, ర‌క్షాబంధ‌నం, అక‌ల్మ‌ష‌హోమం, అక్షిమోచ‌నం, బింబ‌శుద్ధి, పంచ‌గ‌వ్యాధివాసం చేప‌డ‌తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు అగ్నిప్ర‌తిష్ట‌, క‌ల‌శ‌స్థాప‌న‌, కుంభావాహ‌నం, కుంభారాధ‌న‌, హోమం నిర్వ‌హిస్తారు.

మార్చి 20న ఆదివారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

మార్చి 21న సోమ‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట‌ వ‌ర‌కు హోమం, జ‌లాధివాసం, యాగ‌శాల కార్యక్ర‌మాలు, ర‌త్న‌న్యాసం, విమాన క‌ల‌శ‌స్థాప‌న‌, బింబ‌స్థాప‌న‌, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

మార్చి 22న మంగ‌ళ‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు బింబ‌వాస్తు, న‌వ‌క‌ల‌శ స్న‌ప‌నం, చ‌తుర్ద‌శ క‌ల‌శ స్న‌ప‌నం, యాగ‌శాల కార్యక్ర‌మాలు, సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి తిరుమంజ‌నం, రాత్రి 8 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు ర‌క్షాబంధ‌నం, కుంభారాధ‌నం, నివేద‌న‌, శ‌య‌నాధివాసం, హౌత్రం, స‌ర్వ‌దేవ‌తార్చ‌న‌, హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

మార్చి 23న బుధ‌వారం ఉద‌యం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న‌, నివేద‌న‌, హోమం, మ‌హాపూర్ణాహుతి, ఉద‌యం 9 గంట‌ల‌ నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు కుంభాల‌ను, ప్ర‌ధాన దేవ‌తా విగ్ర‌హాల‌ను ప్ర‌ద‌క్షిణగా ఆల‌యంలోకి తీసుకొచ్చి ఉద‌యం 9.50 నుండి 10.20 గంట‌ల మ‌ధ్య వృష‌భ ల‌గ్నంలో మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత ధ్వ‌జారోహ‌ణం, అర్చ‌క బ‌హుమానం అందిస్తారు. మ‌ధ్యాహ్నం 1.30 నుండి సాయంత్రం 6.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. సాయంత్రం 3 నుండి 4.15 గంట‌ల వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం జ‌రుగ‌నుంది. అనంత‌రం ధ్వ‌జావ‌రోహ‌ణం చేప‌డ‌తారు. రాత్రి 7.30 నుండి 8.45 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.