CHAKRASNANAM OF SRI GOVINDARAJA SWAMY TEMPLE HELD _ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి చక్రస్నానం

Tirupati, 24 May 2024: On Friday, the last day of the annual Brahmotsavam of Tirupati Sri Govindarajaswamy, Chakrasnanam was held in grandeur. 

Sri Govindaraja Swamy along with His Consorts reached Sri Kapilatheertham Pushkarini – the Alwar Theertham.

After the Snapana Tirumanjanam, a grand Chakrasnanam was performed.  

In the evening, the deities reached the Sri Govindaraja Swamy Temple.

Tirumala Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Chinna jeer Swamy, Deputy EO of the temple Smt Shanti, Superintendent Sri Mohan Rao, other dignitaries and a large number of devotees participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి చక్రస్నానం
 
తిరుపతి, 2024 మే 24: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం వైభవంగా జరిగింది. 
 
ముందుగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు పల్లకీపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్‌ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ స్నపనతిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ పరిపాలనా భవనం ఎదుట గల పి.ఆర్‌.తోటకు వేంచేశారు. 
 
సాయంత్రం 6 గంటలకు స్వామివారు పి.ఆర్‌.తోట నుండి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 8.40 గంటలకు  ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 
 
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ  చిన్నజీయర్‌స్వామి,    ఆలయ డిప్యూటీఈవో శ్రీమతి శాంతి, సూపరిండెంట్ శ్రీ మోహన్ రావు,  ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.