SRI PADMAVATHI AMMAVARI KARTHIKA BRAHMOTSAVAMS FROM DECEMBER 6 TO 14 _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

TTD EO SRI MUDDADA RAVICHANDRA RELEASES BRAHMOTSAVAM BOOKLET

Tirupati | November 21, 2026: TTD is making elaborate arrangements to celebrate the annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavari at Tiruchanoor from December 6 to 14 in a grand manner, ensuring the comfort of devotees, said TTD EO Sri Muddada Ravichandra.

The EO released the Brahmotsavam booklet at Sri Padmavathi Rest House in Tirupati on Saturday. He said the celebrations would be organised on a grand scale, similar to the annual Brahmotsavams of Lord Venkateswara at Tirumala.

Important Religious Events:

Koil Alwar Tirumanjanam will be held on December 1, followed by Laksha Kumkumarchana and Ankurarpanam on December 5.

Important Vahana Sevas:

•  December 6 – Dwajarohanam

•  December 10 – Gaja Vahanam

•  December 11 – Golden Chariot and Garuda Vahanam

•  December 13 – Rathotsavam

•  December 14 – Panchami Theertham

•  December 15 – Pushpayagam

Vahana Sevas will be held daily from 8 am to 10 am and 7 pm to 9 pm. The EO appealed to devotees to participate in the festivities in large numbers and seek the blessings of Ammavaru.

TTD JEOs Dr A. Sharath and Sri Prabhala Gopinath, CVSO Sri Muralikrishna, CE Sri Manoharam, Temple Deputy EO Sri Harindranath, VGO Sri Giridhar, Deputy EOs Smt V.R. Shanthi, Sri Govindarajulu and Sri Selvam, CMO Dr Kusuma Kumari, Additional Health Officer Dr Sunil Kumar, temple priest Sri Babu Swamy and other officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర

తిరుపతి, 2026 నవంబరు 21: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు.

తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో శనివారం బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను ఈవో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో అమ్మవారి బ్రహ్మోత్సవాలను కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

బ్రహ్మోత్సవాలకు ముందస్తు కార్యక్రమాలు

డిసెంబరు 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, డిసెంబరు 5న లక్షకుంకుమార్చన, అంకురార్పణ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ముఖ్యమైన వాహనసేవలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా డిసెంబరు 6న ధ్వజారోహణం, 10న గజవాహనం, 11న స్వర్ణరథం, గరుడ వాహనం, 13న రథోత్సవం, 14న పంచమితీర్థం, 15న పుష్పయాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఈవో కోరారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు డాక్టర్ ఏ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, సీఈ శ్రీ మనోహరం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, వీజీవో శ్రీ గిరిధర, డిప్యూటీ ఈవోలు శ్రీమతి వి.ఆర్. శాంతి, శ్రీ గోవిందరాజులు, శ్రీ సెల్వం, సిఎంవో డాక్టర్ కుసుమ కుమారి, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.