KAISIKA DWADASI ASTHANAM HELD AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
Tirupati, November 21, 2026: Kaisika Dwadashi Asthanam was held with religious fervour at Sri Govindaraja Swamy Temple in Tirupati on Saturday.
From 7:30 AM to 9:00 AM, Sri Govindaraja Swamy, along with Sridevi and Bhudevi, was seated near the Golden Entrance. Archakas performed the special ritual with Vedic and Puranic recitations.
Kaisika Dwadashi holds special importance in Vaishnava tradition. According to Puranas, Lord Varaha narrated the sacred Kaisika Purana, comprising 82 verses, to Goddess Bhudevi.
Pedda Jeeyar Swamy, Chinna Jeeyar Swamy, Deputy EO Smt. V.R. Shanti, AEO Sri A.B. Narayana Chowdary, Temple Inspector Sri Dhananjaya and temple priests participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుపతి, 2026 నవంబరు 21: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్ర కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం కైశిక ద్వాదశి ఆస్థానం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని బంగారువాకిలి చెంత వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద, పురాణ పఠనాల నడుమ కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించి స్వామివారికి విశేష సేవలు సమర్పించారు.
కైశిక ద్వాదశి పర్వదిన ప్రాశస్త్యం
వైష్ణవ సంప్రదాయంలో కైశిక ద్వాదశికి విశేష ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం, శ్రీ వరాహస్వామివారు కైశిక పురాణంలోని 82 శ్లోకాలతో కూడిన పవిత్ర కథను శ్రీ భూదేవికి వివరించిన పర్వదినంగా దీనికి విశిష్టత ఉంది. భగవంతునిపై అచంచల భక్తి, శరణాగతి, భక్తి ప్రాధాన్యతను చాటిచెప్పే ఈ పురాణ గాథ ఆధారంగా కైశిక ద్వాదశి వైష్ణవ క్షేత్రాల్లో విశేషంగా ఆచరించబడుతోంది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
