PAVITHRA SAMARPANA PERFORMED TRADITINALLY AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
Tirupati, September 23, 2026: As part of the ongoing Pavitrotsavams at Sri Govindaraja Swamy Temple in Tirupati, the Pavitra Samarpana (offering of holy threads) was conducted in a traditional manner on Wednesday morning. Several special rituals were performed at the temple on this occasion. The day began with Suprabhatam to wake the deity, followed by Thomala Seva and Sahasranamarchana
Between 6:30 AM and 8:30 AM, the processional deities (Utsavar) of Sri Govindaraja Swamy, along with His consorts Sridevi and Bhudevi, were taken to the Yagasala where Vedic rituals were performed. From 9:00 AM to 11:00 AM, Snapana Tirumanjanam (holy bath) was conducted, during which the deities were anointed with milk, curd, coconut water, honey, turmeric, and sandalwood paste.
Following this, the Pavitras (holy threads) were offered to the main deity (Moolavar), the processional deities, sub-shrines, parivara deities, the Vimana Prakaram (temple tower), the Dwajasthambham (flag post), and the Sri Matam Anjaneya Swamy.
Temple Deputy EO Smt. Shanti, AEO Sri Narayana Chowdary, Superintendent Sri Chiranjeevi, Temple Inspector Sri Radhakrishna, and temple priests participated in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుపతి, 2026 సెప్టెంబరు 23: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు.
ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







