DEVOTIONAL MUSIC PROGRAMMES ENCHANT DEVOTEES _

Tirupati, September 23, 2026 ;Devotional music programmes held at Mahati Auditorium, Sri Kodandarama Pushkarini and Annamacharya Kala Mandiram in Tirupati on the final day of the Srivari Salakatla Brahmotsavams captivated devotees and the public.

Veenā and flute performances, along with devotional songs and Annamayya and Tyagaraja keerthanas, created a spiritual atmosphere.

Songs including “Chakkani Talliki Changubhala,” “Garudagamana Tava Charanam” and other devotional compositions enthralled the audience.

The programmes were organised by TTD Hindu Dharma Prachar Parishad and Hindu Dharma Projects as part of the Brahmotsava celebrations.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

చక్కని తల్లికి చాంగుభళా….,గరుడగమన…
బ్రహ్మోత్సవాల్లో అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు

వీణ, వేణు లయవిన్యాసం.. భక్తి గీతాలతో ఆధ్యాత్మిక సందడి

తిరుపతి, 2026 సెప్టెంబరు 23 ; తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం తిరుపతిలోని మహతి, శ్రీ కోదండ రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళామందిరం వేదికలపై నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, పురప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మహతిలో వీణ, వేణు లయవిన్యాసం

మహతి ఆడిటోరియంలో చెన్నైకి చెందిన శ్రీ రాఘవేంద్రన్‌ బృందం వీణ, వేణు లయవిన్యాసం హృద్యంగా సాగింది.

ఇందులో భాగంగా అన్నమయ్య కీర్తనలు ‘శ్రీమన్నారాయణ’, ‘జగడపు జనముల జాజర’**తోపాటు త్యాగరాజ కీర్తన ‘ఎందరో మహానుభావులు’ ఆలపించి సంగీతాభిమానులను అలరించారు.

కోదండ రామచంద్ర పుష్కరిణి వద్ద భక్తి సంగీతం

టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామచంద్ర పుష్కరిణి వద్ద నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం భక్తిభావాన్ని నింపింది. కృష్ణా జిల్లాకు చెందిన శ్రీ జి. నరసింహరావు బృందం భక్తి గీతాలను ఆలపించింది.

‘చక్కని తల్లికి చాంగుభళా’, ‘వేదం ఎవ్వరిని వెదకని ఆ దేవునికి’, ‘జయ జనార్దన’, ‘నువ్వైన చెప్పవే మా సాంబశివునికి’, ‘ఇది బ్రహ్మోత్సవం’, ‘గరుడగమన తవ చరణం’, ‘వేదములై’, ‘పిడికిట తలంబ్రాలు’, ‘ఓ శంభో శివ శంభో స్వయంభో’, ‘రఘుకుల తిలక’, ‘ఆరగించి కూర్చున్న అల్లవాడే’, ‘వేడుకుందామ వెంకటగిరి వేంకటేశ్వరున్ని’, ‘చూడరమ్మ సతులార’, ‘సిరులు ఇచ్చు శ్రీలక్ష్మి’ తదితర భక్తి గీతాలను ఆలపించారు.

అన్నమాచార్య కళామందిరంలో భక్తి సంగీతం

అన్నమాచార్య కళామందిరంలో బుధవారం సాయంత్రం బెంగళూరుకు చెందిన శ్రీమతి ఐశ్వర్య మహేష్‌ బృందం నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. భక్తి గీతాలు, కీర్తనలతో కళామందిరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

టీటీడీ హిందూ ధర్మ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల్లో భక్తిభావాన్ని మరింత పెంపొందించాయి.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.