MAHA SAMPROKSHANAM RITUALS COMMENCE _ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

TIRUPATI, 12 MAY 2023: The Maha Samprokshanam rituals in the historical sub-shrine of Sri Lakshmi Narasimha Swamy temple commenced in Sri Kapileswara Swamy temple in Tirupati on Friday.

 

On May 14, Maha Samprokshanam will be observed at 9am followed by Darshanam to devotees.

 

TTD Trust Board member Sri Ashok Kumar, one of the chief priests of Tirumala temple Sri Venu Gopala Deekshitulu, DyEO Sri Devendra Babu, Agama Advisor Sri Mohana Rangacharyulu, AEO Sri Parthasaradi, Superintendent Sri Bhupati and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  
శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
 
మే 12, తిరుపతి, 2023: తిరుపతి కపిలతీర్థంలో గల పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
 
ఇందులో భాగంగా ఉదయం పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం చేపట్టారు. సాయంత్రం అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన, కుంభారాధన, విశేష హోమం నిర్వహించారు. శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు కంకణభట్టారుగా వ్యవహరించారు.
 
మే 14న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
 
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహనరంగాచార్యులు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి,  టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రవికుమార్ పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.