ANNAMAIAH SONGS ARE ESSENCE OF VEDAS IN LOCAL SLANG _ అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానసారం : ఆచార్య మలయ వాసిని

TIRUPATI, 12 MAY 2023: With a noble aim to propagate the great values embedded in Vedas to reach every common man, Saint poet Sri Tallapaka Annamacharya penned 32000 Sankeertans, said Dr Malayavasini of Andhra University.

Speaking on the last day of literary session as part of  615th Jayanti celebrations of Annamacharya at Annamacharya Kalamandiram in Tirupati, she said Annamacharya preached Nava Vidha Bhakti Margams in his sankeertans and made the people to choose righteous path in their lives.

Rajamundry’s Andhra Yuvati Sanskrit College Principal Dr Peram Naidu, Hyderabad-based Jeeyar Educational Trust Chairman Sri Ranga Ramanujacharya also spoke on the occasion. Earlier Sri Kodanda Rama Swamy Asthanam was also performed.

In the evening the musical feat by Sri Saraswati Prasad and Sri Rajesh Kumar allure the music lovers followed by Harikatha Ganam by Smt Jandhyala Krishna Kumari and team.

Annamacharya Project Director Dr Vibhishana Sharma and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

అన్నమయ్య సంకీర్తనల్లో వేద విజ్ఞానసారం : ఆచార్య మలయ వాసిని

 తిరుపతి, 2023 మే 12: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల్లో వేద విజ్ఞానసారం ఇమిడి ఉందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ మలయవాసిని చెప్పారు .
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జ‌యంతి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి . ఈ సందర్బంగా అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు జ‌రిగింది.
డాక్టర్ మలయ వాసిని ”అన్నమయ్య – ఆధ్యాత్మికత‌ కీర్తనలు ” అనే అంశంపై ఉపన్యసించారు.

ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలు రచించిచారన్నారు.

భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. ఆయన సంకీర్తనల్లో నవవిధ భక్తి మార్గాలను తెలిపినట్లు చెప్పారు. ఆలయం, తీర్ధాలు, భక్తుల కష్టాలు, సప్త గిరుల విశిష్టతను తన కీర్తనల ద్వారా తెలియజేశారన్నారు.

రాజమండ్రి ఆంధ్రయువతి సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పేరం నాయుడు “అన్నమయ్య పద కవితా ధోరణి ” అనే అంశంపై ప్రసంగించారు. అన్నమయ్య అచ్చ తెలుగు పదాలతో కీర్తనలు రచించి సాహిత్యాన్ని పరిపుష్టం చేశారన్నారు. సంగీతం, సాహిత్యంతో పాటు బహు భాషా పండితుడైన అన్నమయ్య కావ్యరచనపై దృష్టిపెట్టలేదని చెప్పారు . పదకవిత్వాన్ని భక్తిపథ కవిత్వంగా మార్చి ధర్మాచార్యుడిగా ఘనత పొందారని వివరించారు.

హైదరాబాద్ జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఆచార్య సముద్రాల రంగ రామానుజాచార్యులు “అన్నమయ్య కీర్తనలు – రామానుజాచార్యులు” అనే అంశంపై ప్రసంగించారు. నారాయణ మంత్రం అందరిదని వర్ణ లింగ వివక్ష లేకుండా అందరూ సమానమని వివరించారు.

అంతకుముందు ఉదయం 8:30 గంటలకు శ్రీ కోదండ రామస్వామి వారి ఆస్థానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్టి గానం నిర్వహించారు.

సాయంత్రం 6 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి సరస్వతీ ప్రసాద్, శ్రీ రాజేష్ కుమార్ బృందం సంగీత సభ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు శ్రీమతి జంధ్యాల కృష్ణకుమారి బృందం హరికథ గానం చేయనున్నారు.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా.విభీషణ శర్మ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.