TTD INVITES JOURNALISTS FACT FINDING COMMITTEE PROBE INTO SRIVANI TRUST AFFAIRS _ శ్రీ‌వాణి ట్ర‌స్టుపై మీడియా ప్ర‌తినిధుల‌ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీకి టీటీడీ అనుమ‌తి

Tirumala, 01 August 2023: In the background of the persistent campaign by vested interests on the affairs of SRIVANI Trust, TTD has approved a Fact Finding Committee formed by Tirupati Press Club to probe the issue. 

TTD allocated funds for the rejuvenation of dilapidated temples in both Telugu states, besides temple building new ones in SC, ST, BC and fishermen areas. 

TTD also gave funds for Dhoopa Deepa rituals in temples of remote areas.

Recently TTD Chairman Sri YV Subba Reddy had released a white paper on SRIVANI Trust issues. 

As the malicious campaign continued in this connection, TTD has agreed to offer by Tirupati Press Club to hold an independent Fact Finding Committee for enquiry with hope that true facts surfaces and confusion among devotees is resolved. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వాణి ట్ర‌స్టుపై మీడియా ప్ర‌తినిధుల‌ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీకి టీటీడీ అనుమ‌తి

తిరుమల, 2023 ఆగస్టు 01: శ్రీ‌వాణి ట్ర‌స్టుపై కొంత‌మంది వ్య‌క్తులు ప‌నిగ‌ట్టుకుని ఆరోప‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఈ విష‌యంలో వాస్త‌వాల‌ను తెలుసుకోవ‌డానికి ఏర్పాటైన తిరుప‌తి ప్రెస్‌క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలోని నిజ‌నిర్ధార‌ణ క‌మిటీకి టీటీడీ అనుమ‌తించింది.

శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అనేక పురాత‌న ఆల‌యాల జీర్ణోద్ధ‌ర‌ణ‌తోపాటు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార గ్రామాల్లో ఆల‌యాల నిర్మాణానికి టీటీడీ నిధులు అందిస్తోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లోని ఆల‌యాల్లో ధూప‌దీప నైవేద్యాల‌కు ఆర్థిక‌సాయం కూడా చేస్తోంది. టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి శ్రీ‌వాణి ట్ర‌స్టుపై ఇటీవ‌ల శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేశారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్య‌క్తులు శ్రీ‌వాణి ట్ర‌స్టు నిర్వ‌హ‌ణ‌పై ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డంతో ఈ విష‌యంలో వాస్త‌వాలు వెలుగులోకి తీసుకురావ‌డానికి తిరుప‌తి ప్రెస్‌క్ల‌బ్ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీగా ఏర్పాటై ముందుకు వ‌చ్చింది. వాస్త‌వాలు తెలుసుకోవ‌డానికి స‌ద‌రు క‌మిటీకి టీటీడీ అనుమ‌తించింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.