GARUDA SEVA HELD _ శ్రీవారి ఆలయంలో వైభవంగా అధిక మాసం శ్రావణ పౌర్ణమి పౌర్ణమి గరుడ సేవ

TIRUMALA, 01 AUGUST 2023: On the auspicious Adhika Masa Shravana Pournami, the monthly Garuda Seva was observed in Tirumala between 7pm and 9pm.

Sri Malayappa blessed His devotees along four mada streets in the pleasant evening.

Both the seers of Tirumala, DyEO Sri Lokanatham and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా అధిక మాసం శ్రావణ పౌర్ణమి పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల‌, 2023 ఆగష్టు 01: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.