శ్రీవారి ఆలయంలో నృసింహ జయంతి

శ్రీవారి ఆలయంలో నృసింహ జయంతి

తిరుమల,  23 మే 2013 : వైశాఖ శుక్ల చతుర్దశీ గురువారము స్వాతీ నక్షత్రమున ప్రదోష సమయమునందు, అనగా సూర్యాస్తమయ కాలమున శ్రీ మహావిష్ణువు థావతారాల్లో అత్యంత భీకర స్వరూపమైన శ్రీ నృసింహావతారమును దుష్టశిక్షణ శిష్టరక్షణ కొరకు ధరించిన సుముహూర్త సందర్భంగా శ్రీవారి అలయంలో నృసింహజయంతిని ఘనంగా నిర్వహిస్తారు. సంవత్సరానికి ఒక పర్యాయం మాత్రమే నిర్వహించే ఈ ఉత్సవం సాయంత్రం 7.00 గంటలకు శ్రీవారి ఆలయంలోని యోగ నృసింహస్వామికి పాలు, చందనం, పెరుగు, తేనె ఇత్యాది పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, పూజ, నైవేద్యాది కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు పాల్గొంటారు.

మే 25న ఘనంగా పౌర్ణమి గరుడసేవ

ఈ నెల 25వ తారీఖున పౌర్ణమిగరుడసేవను తి.తి.దే ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుఢారూరుడై శనివారం రాత్రి 7 గం||ల నుండి 9 గం||ల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.