MAHASAMPROKSHANAM PERFORMED IN NAGARI TEMPLE _ ఘనంగా నగరి శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

Nagari, 23 May 2013: The Mahasamprokshanam has been performed in the TTD sub-temple of Sri Kariya Manikyaswamy located in Nagari on Thursday in a ceremonious manner.
 
The ritual began with Mahashanti Abhishekam in the morning followed by Purnahuti which was performed by the Vedic scholars in the Yagashala. Later the installation of Dhwajastambham-the temple pillar took place followed by the Dhwajarohana mahotsavam.
 
Meanwhile on May 21 Ankurarpanam has been performed for the Mahasamprokshanam of the temple, while Vigraha Pratisthapana took place on May 22.
 
On May 24 kalyanam will be performed in the evening while Dhwaja avarohanm will take place in the night of the same day.
 
TTD EO Sri LV Subramanyam, JEOs Sri P Venkatrami Reddy, Sri KS Sreenivasa Raju, CVSO Sri GVG Ashok Kumar, SE Sri Ramachandra Reddy, Nagari Legislator Sri Muddu Krishnama Naidu and others were also present.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
 
ఘనంగా నగరి శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

తిరుపతి, మే  23, 2013: నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామివారి ఆలయ పునర్నిర్మాణ మహాసంప్రోక్షణ గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం మహాశాంతి అభిషేకంతో ప్రారంభించి యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి చేపట్టారు. అనంతరం వైఖానసాగమోక్తంగా వేదమంత్రోచ్ఛారణ నడుమ ధ్వజస్తంభ స్థాపన, ధ్వజారోహణం నిర్వహించారు. సాయంత్రం ఊంజల్‌సేవ, వీధి ఉత్సవం జరుగనున్నాయి.
ఆలయ మహాసంప్రోక్షణలో భాగంగా మే 21న అంకురార్పణం, మే 22న విగ్రహప్రతిష్ఠ, కలశాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చివరి రోజైన మే 24వ తేదీన ఉదయం స్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం 4.30 గంటలకు స్వామివారి కల్యాణం, రాత్రి 9.00 గంటలకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, నగరి శాసనసభ్యులు శ్రీ గాలి ముద్దుకృష్ణమనాయుడు, జెఈవోలు శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, ఎస్‌ఈ శ్రీ రామచంద్రారెడ్డి, తితిదే వైఖానస ఆగమసలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
   —————————–——————————————-
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.