KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUMALA, 02 APRIL 2024: In connection with Telugu Ugadi on April 9, Koil Alwar Tirumanjanam was held in Tirumala temple on Tuesday.

Speaking on the occasion TTD Chairman Sri Karunakara Reddy said, Koil Alwar Tirumanjanam is a traditional temple cleaning ritual that is being observed four times in a year before Anivara Asthanam, Annual Brahmotsavam, Vaikuntha Ekadasi and Telugu Ugadi.

As a part of this cleaning fete, the entire temple including the roofs, walls, puja utensils in the sanctum santorum and in sub-shrines were smeared with an aromatic mixture called Parimalam.

Later devotees were allowed for darshan of Sri Venkateswara Swamy.

TTD has cancelled Astadala Pada Padmaradhana seva in view of the ritual.

TTD EO Sri AV Dharma Reddy, DLO Sri Veeraju,  temple DyEO Sri Lokanatham, Peishkar Sri Srihari and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2024 ఏప్రిల్ 02: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి క‌లిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీ‌వారి ఆల‌యంలో ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం ఉద‌యం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. సాధార‌ణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంద‌న్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో డిఎల్‌వో శ్రీ వీర్రాజు, డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, పెష్కార్ శ్రీ శ్రీ హరి, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.