PUSHPAYAGAM IN SKVST ON APRIL 4 _ ఏప్రిల్ 3న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

TIRUPATI, 02 APRIL 2024: The annual Pushpayagam in Sri Kalyana Venkateswara Swamy temple will be observed by TTD on April 4 with Ankurarpanam on April 3.

The annual brahmotsavams in this famous shrine were held from February 29 to March 8 in a grand manner. 

As a “Prayaschita” to the sins committed either knowingly or unknowingly by the religious, temple staffs and even devotees, Pushpa Yagam is observed as an annual fete.

The processional deities of Sri Kalyana Venkateswara, Sridevi and Bhudevi will be rendered a floral bath on this auspicious day with several tonnes of varieties of traditional and ornamental flowers between 2pm and 4pm.

Earlier during the day Snapana Tirumanjanam will also be rendered to the processional deities between 10am and 11am.

The temple authorities have cancelled Astottara Sata Kalashabisekam on April 3,  Tiruppavada and Nitya Kalyanotsavam on April 4 owing to the annual Pushpayagam rituals.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 3న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

 తిరుపతి, 2024 ఏప్రిల్ 02: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగానికి ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

ఇందులో భాగంగా ఏప్రిల్ 4న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.

శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 3న అష్టోత్త‌ర శ‌త‌క‌ళశాభిషేకం, ఏప్రిల్ 4న తిరుప్పావ‌డ‌, నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.