TTD BOARD CHIEF AND EO INVITES MAHA CM AND DEPUTY CM FOR BHOOMI PUJA ON AUGUST 21 _ శ్రీవారి ఆలయ భూమి పూజకు రండి– మహారాష్ట్ర సి ఎం , డిప్యూటీ సి ఎం కు టీటీడీ చైర్మన్ ,ఈవో ఆహ్వానం

TIRUMALA, 06 AUGUST 2022:  The Honourable CM of Maharashtra Sri Ekanath Shinde and Deputy CM Sri Devendra Fadnavis were invited by TTD Chairman Sri YV Subba Reddy and the EO Sri AV Dharma Reddy on Saturday at Mumbai, for the Bhoomi Puja of Sri Venkateswara Swamy temple scheduled to be held at Navi Mumbai on August 21.

 

Both the CM and Deputy CM of Maha Government expressed their pleasure to take part in the Bhoomi Puja. Later the Vedic pundits offered Vedaseervachanam to both the dignitaries followed by presenting of Theertha Prasadams.

 

It may mentioned here that the Maharashtra Government has allotted 10 acres of prime land, whose market value is estimated to be about 500 crore, to the Tirumala Tirupati Devasthanams (TTD) towards the construction of Sri Venkateswara temple at Ulve near Navi Mumbai a few months ago.

 

The Managing Director of Raymond Group, Sri Gowtham Singhania has come forward to bear the entire cost of the construction of the temple which is estimated to be Rs. 60-70crores.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయ భూమి పూజకు రండి

– మహారాష్ట్ర సి ఎం , డిప్యూటీ సి ఎం కు టీటీడీ చైర్మన్ ,ఈవో ఆహ్వానం

తిరుమల 6 ఆగస్టు 2022: ముంబై లో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ లను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి ఆహ్వానించారు .

ఈ మేరకు శనివారం ఉదయం వీరు ముంబైలో సిఎం , డిప్యూటీ సి ఎం లను కలిశారు . వేద పండితులు శ్రీ షిండే ,శ్రీ ఫడ్నవీస్ కు వేద ఆశీర్వచనం చేశారు . చైర్మన్ ,ఈవో శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు . ఆగస్టు 21వ తేదీ భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు . సి ఎం, డిప్యూటీ సి ఎం ఇద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పారు .

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి అప్పగించింది . రేమండ్స్ కంపెనీ అధినేత శ్రీ గౌతం సింఘానియా ఈ భూమి లో స్వామి వారి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది