MATRUSRI VENGAMAMBA VARDHANTI CONCLUDES _ ముగిసిన వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు
Tirupati, 06 August 2022: The two-day long celebrations of 205th Vardhanti Utsava of Tarigonda Matrusri Vengamamba concluded on Saturday.
The festivities of valedictory fete included sangeet programs at Annamacharya Kala Mandiram and garlanding and floral tributes to Sri Vengamamba statue in MR Palli by Dr Akella Vibhishana Sharma, Director of Annamacharya Project.
Highlights of cultural programs in Kala Mandiram were sangeet concert by Sri P Srinivasa Kumar and Sri Shyam Kumar team in morning and Harikathas by Smt Sitalakshmi team in the evening followed by sangeet concert by Annamacharya Project artists Smt R Sushila, Smt T Tajovathi.
Tarigonda Vengamamba project coordinator Dr C lata and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ముగిసిన వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు
ఎంఆర్.పల్లి సర్కిల్‌లో వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతి, 2022 ఆగస్టు 06: తిరుపతిలో రెండు రోజుల పాటు జరిగిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 205వ వర్ధంతి ఉత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిరంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఎంఆర్.పల్లి సర్కిల్ వద్దగల వెంగమాంబ విగ్రహానికి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.
అన్నమాచార్య కళామందిరంలో ఉదయం శ్రీ పి.శ్రీనివాసకుమార్, శ్రీ ఆర్.శ్యాంకుమార్ బృందం సంగీత సభ నిర్వహించారు. ఆ తరువాత శ్రీమతి సీతాలక్ష్మి హరికథ వినిపించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి ఆర్.సుశీల, శ్రీమతి టి.తేజోవతి బృందం సంగీత సభ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డా.సి.లత తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.