DEVOTIONAL MUSIC AND SPIRITUAL PROGRAMMES ENTHRALL DEVOTEES _ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అలరించిన ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
Tirumala, October 17, 2026: TTD’s Hindu Dharma Prachara Parishad organised devotional and spiritual programmes in Tirumala on Saturday as part of Srivari Navaratri Brahmotsavams.
Mangala Dhwani, Vedic messages, dance performances and Annamacharya Sankeertans enthralled devotees at Nada Neerajanam. Vishnu Sahasranama Parayanam, devotional music, spiritual discourses, Annamacharya Sankeertans and Harikatha were presented at Asthana Mandapam.
Large numbers of devotees attended the programmes and experienced spiritual bliss through Govinda Nama Sankirtana.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అలరించిన ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
నాదనీరాజనం, ఆస్థాన మండపంలో ఆధ్యాత్మిక సందడి
తిరుమల, 2026 అక్టోబరు 17 ;శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శనివారం తిరుమలలో నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నాదనీరాజనం వేదికపై మంగళధ్వని, వేద సందేశం, నృత్య ప్రదర్శన, అన్నమయ్య సంకీర్తన లహరి భక్తులను అలరించాయి.
ఆస్థాన మండపంలో విష్ణు సహస్రనామ పారాయణం, భక్తి సంగీతం, ధార్మికోపన్యాసం, అన్నమయ్య సంకీర్తనలు, హరికథ భక్తులను భక్తిభావంలో ముంచెత్తాయి.
ఈ కార్యక్రమాలను భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించి, గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







