DEVOTIONAL MUSIC AND DANCE ENTHRALL TIRUPATI _ తిరుపతిలో ఆధ్యాత్మిక సంగీత, నృత్య ప్రదర్శనలతో భక్తిభావ పరిమళం

Tirupati, October 17, 2026 ; As part of the Salakatla Brahmotsavams, TTD organised devotional music and dance programmes at Mahati Kalakshetram, Annamacharya Kalamandiram and Sri Kodandarama Swamy Pushkarini on Saturday.

Mridangam, Bharatanatyam, violin, Kuchipudi and devotional music performances captivated devotees and art lovers.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తిరుపతిలో ఆధ్యాత్మిక సంగీత, నృత్య ప్రదర్శనలతో భక్తిభావ పరిమళం

మహతిలో మృదంగ లయవిన్యాసం, భరతనాట్యం..

 అన్నమాచార్య కళామందిరంలో వయోలిన్, కూచిపూడి..

 కోదండరామాలయం వద్ద భక్తి సంగీతం

తిరుపతి, 2026 అక్టోబరు 17 ; శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం తిరుపతిలో టీటీడీ నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. సంగీత, నృత్య కళాకారుల ప్రదర్శనలతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.

తిరుపతి మహతి కళాక్షేత్రంలో సాయంత్రం డాక్టర్ వి. సత్యవరప్రసాద్ బృందం మృదంగ లయవిన్యాసంతో అలరించింది. అనంతరం శ్రీ చైతన్య కుసుమప్రియ, ఎ. బాలాజీ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను భక్తిభావంలో ముంచెత్తింది.

అన్నమాచార్య కళామందిరంలో తిరుపతికి చెందిన శ్రీమతి చల్లా ప్రభావతి బృందం వయోలిన్ ప్రదర్శనతో సంగీతామృతాన్ని పంచగా, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సురభి లక్ష్మీ శారద బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.

శ్రీ కోదండరామస్వామివారి పుష్కరిణి వద్ద చెన్నైకి చెందిన ఎన్. పద్మలత బృందం నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది.

ఈ కార్యక్రమాలను శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు చెన్నయ్య, సప్తగిరి మాసపత్రిక సీనియర్ ఉపసంపాదకురాలు డాక్టర్ అల్లాడి సంధ్య, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సిబ్బంది శ్రీమతి కుసుమకుమారి, శ్రీమతి ధనలక్ష్మి, సంగీత, నృత్యాభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించి ఆనందించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది