CHOOSE BEST TEAMS FOR BTU-TIRUPATI JEO_ శ్రీవారి బ్రహ్మూత్సవాలకు మెరుగైన కళాబృందాలను ఎంపిక చేయాలి : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 29 August 2017: The best Kalabrinndams should be chosen to perform before procession of vahanams during the ensuing annual Brahmotsavams at Tirumala, said Tirupati JEO Sri P Bhaskar.

A review meeting on Brahmotsavams with all projects was held in his chambers in Tirupati in TTD administrative building on Tuesday.
Speaking on this occasion, the JEO instructed the HDPP officials that the Bhajan teams which have expertise in culture, literature and art form should be selected for the mega religious event. Convene a two day meeting with all team leaders to discuss on the modalities with them”, he directed the HDPP Secretary Sri Ramakrishna Reddy. “Create a separate link for HDPP on TTD website to carry the details of Bhajan teams”, he instructed the IT wing.

Later he also instructed the publications department to come out with unique books matching the occasion. “The SVCLRC should take up the digitalisation of all books as soon as possible”, he added.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి బ్రహ్మూత్సవాలకు మెరుగైన కళాబృందాలను ఎంపిక చేయాలి : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

ఆగస్టు 29, తిరుపతి, 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల వాహనసేవల్లో తిరుమాడ వీధుల్లో ప్రదర్శనలిచ్చేందుకు మెరుగైన కళాబృందాలను ఎంపిక చేయాలని హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధికారులను టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో వివిధ ప్రాజెక్టుల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ హిందూ ధర్మప్రచారపరిషత్‌కు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించాలని హెచ్‌డిపిపి, ఈడిపి అధికారులను ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ద్వారా ధర్మ ప్రచార మండళ్లను బలోపేతం చేయాలని సూచించారు. భజన సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యంలో విశేష అనుభవం ఉన్నవారిని భజన మండళ్ల సభ్యులుగా ఎంపిక చేసుకోవాలన్నారు. భజన మండళ్ల పటిష్టతకు మార్గదర్శకాలు రూపొందించేందుకు తిరుపతిలో రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

పుస్తక ప్రచురణ కోసం విధి విధానాలు రూపొందించాలని, తద్వారా భక్తులకు మరింత మెరుగైన భక్తి సాహిత్యాన్ని అందించవచ్చని జెఈవో తెలిపారు. భక్తులు ఆదరిస్తున్న పుస్తకాలు, వాటి లభ్యత, వివిధ పుస్తకాల పునర్‌ముద్రణ తదితర అంశాలపై వివిధ ప్రాజెక్టుల అధికారులతో చర్చించారు. టిటిడిలో ఉన్న పలు గ్రంథాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించేందుకు వీలుగా ఎస్వీ కేంద్ర గ్రంథాలయాన్ని వీలైనంత త్వరగా డిజిటలైజ్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సప్తగిరి మాస పత్రిక సంచికలను ఎప్పటికప్పుడు టిటిడి వెబ్‌సైట్‌లో పొందుపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా|| ఆంజనేయులు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య, సప్తగిరి మాసపత్రిక చీఫ్‌ ఎడిటర్‌ డా|| రాధారమణ, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి శ్రీ కె.జె.కృష్ణమూర్తి, ఎస్వీ సెంట్రల్‌ లైబ్రరీ ప్రత్యేకాధికారి శ్రీచంద్రశేఖర్‌, ఈడిపి మేనేజర్‌ శ్రీ భాస్కర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.