JEO REVIEWS ON BRAHMOTSAVAM ARRANGEMENTS_ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కలిగేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 29 August 2017: In view of annual Brahmotsavams of Lord Venkateswara at Tirumala which are set to commence from September 23 onwards, Tirumala JEO Sri KS Sreenivasa Raju reviewed over the ongoing arrangements for the same with various department heads in Tirumala.

The review meeting was held at Annamaiah Bhavan on Tuesday. After review meeting speaking to media, the JEO said, all our departments are gearing up for the big religious fete. The engineering works will be completed on time. While the new bridge which is planned from Saptagiri Satralu to Asthana Mandapam will be completed by September 20. “This year we are arranging 11 LED screens outside which is five more than last year’s for the sake of devotees who could not make it to galleries.

Elaborating further he said, “We have also identified some parking places at Bharatiya Vidya Bhavan and Devalok for 2500 four wheelers in view of anticipated heavy rush on Garuda Seva Day due to space problem in Tirumala. My Tirupati counterpart Sri P Bhaskar is taking all initiative to make arrangements of food, water, toilets, help desks at the identified places. The APSRTC also operates buses from Devalok to Tirumala on ticket basis”, he added.

During the review meeting CVSO Sri Ake Ravikrishna, Additional FACAO Sri O Balaji, SE II Sri Ramachandra Reddy, GM Transport Sri Sesha Reddy, DyEOs Sri Kodanda Rama Rao, Sri Venugopal, Health Officer Dr Sermista and other officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కలిగేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2017 ఆగస్టు 29: దేశం నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం, మరింత భక్తిభావం కలిగేలా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేపట్టాలని, ఇందుకోసం టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుమల జెఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 23 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఇంజినీరింగ్‌ పనులు దాదాపు పూర్తి కావస్తున్నట్లు వివరించారు.

సప్తగిరి సత్రాల నుండి ఆస్థాన మండపం వరకు నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు సెప్టెంబరు 20వ తేదీకి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మాడ వీధులతోపాటు భక్తుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలలో 11 ఎల్‌ఈడి స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఐదు ఎల్‌ఈడి స్క్రీన్‌లు అదనంగా ఏర్పాటు చేయనున్నామన్నారు.

సెప్టెంబరు 27న శ్రీవారి గరుడసేవకు విశేషంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌ పాఠశాల మైదానం, దేవలోక్‌ ప్రాంగణంలో 2500 నాలుగు చక్రాల వాహనాలు నిలిపి ఉంచేలా పార్కింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆధ్వర్యంలో వాహనాల పార్కింగ్‌ ప్రదేశాల వద్ద అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ ఆకె రవికృష్ణ, అదనపు ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, ఎస్‌ఇ2 శ్రీ రామచంద్రారెడ్డి, రవాణా విభాగం జిఎమ్‌ శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీ వేణుగోపాల్‌, ఆరోగ్య శాఖ అధికారి శ్రీమతి శర్మిష్ఠ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.