“SRIVARI SEVAKULU ARE BRAND AMBASSADORS OF HINDU SANATANA DHARMA”-CVSO _ శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారకులు : టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్

TIRUMALA, 18 MAY 2022: Lauding the selfless services of ‘Srivari Sevakulu’, TTD CVSO Sri D Narasimha Kishore termed them as brand ambassadors of the Hindu Sanatana Dharma.

 

Giving a pep talk to the ‘Srivari Seva’ volunteers here on Wednesday evening, he said, “You are doing a great service to the pilgrims. Started with just 200 volunteers in 2000, today so far nearly 13 lakhs sevaks have rendered impeccable services to the pilgrims speaks volumes about your dedication, devotion and commitment”, he complimented.

 

Adding further he said, “Apart from your regular services, you also contribute your feedback after completing your service for the betterment of the administration in the areas including accommodation, annaprasadam, health, medical, kalyanakatta, vigilance, temple etc.”, he maintained. He also suggested the Srivari Seva officials to prepare a powerpoint presentation on service areas starting from Alipiri to Tirumala for extracting more qualitative services from Srivari Sevakulu”. 

 

Earlier, TTD PRO Dr T Ravi said Srivari Sevakulu have spread from Kashmir to Kanyakumari and of great use to TTD in its dharmic activities across the country. He said, very soon a route map will be placed in Srivari Seva Sadan 1 and 2 for better understanding of Srivari Sevakulu about their service places in Tirumala.

 

The Bhajan and Satsang programme carried out by OSDs Sri Sridhar and Sri Phaniranga Sai mused the Srivari Sevakulu.

 

APRO Kum. Neelima, AEO Smt Nirmala, AVSO Sri Sai Giridhar, VI Sri Damodaram and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారకులు : టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్

 మే 18, తిరుమల, 2022: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు టిటిడి నిర్వహిస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వచ్ఛందంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారకులని టిటిడి సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ కొనియాడారు. తిరుమల శ్రీవారి సేవా సదన్ -2లో బుధవారం సాయంత్రం జరిగిన శ్రీవారి సేవకుల సత్సంగం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సివిఎస్వో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులను దైవసమానులుగా భావించి సేవలందిస్తున్నారని, ఈ సేవాభాగ్యం పూర్వజన్మసుకృతమని అన్నారు. 200 మందితో ప్రారంభమైన శ్రీవారి సేవలో 22 ఏళ్లలో దాదాపు 13 లక్షల మంది సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులపై స్వామివారి కృప తప్పకుండా ఉంటుందన్నారు. అలిపిరి నుండి మొదలుపెట్టి తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు ఎలాంటి సేవా విధులు నిర్వహించాలనే విషయంపై రూట్ మ్యాప్ తో కూడిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ తయారు చేయాలని సూచించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి.రవి మాట్లాడుతూ శ్రీవారి సేవకుల సేవా విధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపకల్పన జరుగుతోందన్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు శ్రీవారి సేవకుల నుండి సూచనలు, సలహాలు(ఫీడ్ బ్యాక్) తీసుకుంటున్నామని చెప్పారు. సెల్ ఫోన్లు, లగేజ్ డిపాజిట్ కౌంటర్లు, పాదరక్షల కౌంటర్ల వివరాలతో కూడిన రూట్ మ్యాప్ ను త్వరలో శ్రీవారి సేవకులకు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు శ్రీవారి సేవకులు మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి చెంత సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా టిటిడికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సత్సంగంలో భాగంగా ఓఎస్డీలు శ్రీ శ్రీధర్, శ్రీ ఫణిరంగసాయి ఆలపించిన భజన కీర్తనలు శ్రీవారి సేవకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఓ కుమారి పి.నీలిమ, ఏఈఓ శ్రీమతి నిర్మల, ఎవిఎస్వో శ్రీ సాయిగిరిధర్, విఐ శ్రీ దామోదరం, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.