ANNAMAIAH PENNED KEERTANS ON SUDARSHANA _ సుదర్శన చక్రంలో పరమేశ్వరుని తేజస్సు : ఆచార్య కె.రాజగోపాలన్

TIRUPATI, 18 MAY 2022: Sri Tallapaka Annamacharya penned Sankeertans on Sri Sudarshana Chakrattalwar and those Sankeertans need to be popularised in public said National Sanskrit Vidya Peetham, Professor Dr Rajagopalan.

 

Speaking at Annamacharya Kalamandiram on the occasion of the  614th Jayanthi fete on Wednesday, he said, in his Sankeertan Chakrama… Hari Chakrama… Annamacharya described the greatness of the divine Disc.

 

Later cultural programmes followed.

 

At Mahati Auditorium, Sri Madhusudhan Rao and his team presented Sankeertans.

 

Annamacharya Project Director Dr A Vibhishana Sharma, Program Co-ordinator Smt Lata and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సుదర్శన చక్రంలో పరమేశ్వరుని తేజస్సు : ఆచార్య కె.రాజగోపాలన్

తిరుపతి, 2022 మే 18: పరమేశ్వరుడు తన తేజస్సుతో సుదర్శన చక్రాన్ని తయారు చేసి శ్రీ మన్నారాయణుడికి బహుమతిగా ఇచ్చారని, సుదర్శన చక్రంపై శ్రీ అన్నమయ్య రచించిన కీర్తనలు జనబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్లాయని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కె.రాజగోపాలన్ పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జ‌యంతి ఉత్సవాల్లో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో బుధవారం సాయంత్రం సాహితీ సదస్సు జ‌రిగింది.

ఈ సందర్భంగా ఆచార్య కె.రాజగోపాలన్ ”అన్నమయ్య సంకీర్తనల్లో సుదర్శన వైభవం” అనే అంశంపై ఉపన్యసించారు. శ్రీవారి ఆయుధమైన శ్రీ సుదర్శన భగవానుడిని అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా కీర్తించారని తెలిపారు. చక్రమా.. హరి చక్రమా… అనే కీర్తన విశేష ఆదరణ పొందిందన్నారు. దుష్ట శిక్షణలో భాగంగా సుదర్శన చక్రం ఏయే విధాలుగా స్వామివారికి సేవ చేసిందనే అంశాలతో అన్నమయ్య రచించిన కీర్తనలు విస్తృతంగా జనబాహుళ్యంలో ఉన్నాయన్నారు. ధనుజ సంహారం పేరుతో శ్రీమహావిష్ణువు అనేక అవతారాలలో రాక్షసులను సంహరించిన విధానాన్ని అన్నమయ్య తన కీర్తనలలో వివరించారని ఆయన చెప్పారు. ఆరు కోణములతో వర్తులాకారంలో పరిభ్రమిస్తూ అగ్నిశిఖలు వెదజల్లుతూ సుదర్శన చక్రం కదులుతున్న తీరును వర్ణించిన విధానం రమణీయంగా ఉంటుందన్నారు. స్వామివారి సుదర్శన చక్రం గురించి వామన, పద్మ పురాణాల్లో ప్రముఖంగా ఉందని వివరించారు. పరమేశ్వరుడు తయారుచేసిన సుదర్శన చక్రానికి త్రినేత్రుడు అనే పేరు కూడా ఉందని తెలియజేశారు.

అంత‌కుముందు ఉద‌యం 10.30 గంటలకు మదనపల్లికి చెందిన శ్రీమతి ఎ.శారద బృందం హ‌రిక‌థ వినిపించారు. రాత్రి 7 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీపి.రాజేష్ కుమార్, శ్రీమతి జి.లావణ్య బృందం గాత్ర సంగీత స‌భ‌ జరగనుంది.

మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో…

తిరుపతి మహతి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం 6 నుండి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ జి.మధుసూదన్ రావు బృందం అన్న‌మ‌య్య సంకీర్త‌న లహ‌రి గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 7.30 గంట‌లకు తిరుప‌తికి చెందిన శ్రీమతి ధనశ్రీ శ్రీనివాస్ బృందం భరతనాట్య ప్రదర్శన జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీమతి లత, ఇతర అధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.