JAPAN APPLES – MUSCAT GRAPES – KOREAN PEARS FOR SRIVARI SNAPANA _ శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్ – మస్కట్ గ్రేప్స్ – కొరియన్ పియర్స్

FINGER MILLETS GARLANDS STEALS THE SHOW

ONE TON CUT FLOWERS AND FRUITS USED FOR THE SET UP

SNAPANA TIRUMANJANAM HELD WITH DIVINE FERVOUR

TIRUMALA, 28 SEPTEMBER 2022: It is not only the Desi cereals, fruits, flowers, spices that sanctify their lives in the divine service, but also the apples from Japan, Grapes from Muscat, Pears from Korea, Mangoes from Thailand and Cherries from America that sailed all their way travelling thousands of kilometres from their homelands to bliss their lives in the service of Universal Lord, Sri Venkateswara.

On the second day afternoon on Wednesday, Snapana Tirumanjanam was held in Ranganayakula Mandapam. The processional deities of Sri Malayappa flanked by Sridevi and Bhudevi were seated on a special platform and were offered the sacred bath with aromatic ingredients.

The special arrangements by the Garden wing of TTD to match the occasion stood as a special attraction. Apart from decorating the stage with one ton colourful flowers, orchids, fruits, creepers, the garlands that were offered to Malayappa remained unique. For the first time, the garlands made of Finger Millet (Ragi Mala) remained a cynosure besides Green Pavitras and Coral malas which have also made their maiden way in Snapana Tirumanjanam in addition to Cardomom, Cuscus, Grapes, Tulasi garlands.

According to Garden Deputy Director Sri Srinivasulu, this year Lichis from Thailand, Australian pink and black grapes, and other fruits from various countries have been offered to the deities as Naivedyam. The decorations were specially made by florists from Chennai who worked on the magical set up for four days”, he added.

HH Sri Pedda Jeeyar Swamy, HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, TTD EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh Babu and other dignitaries, temple officials were present in the holy event that took place amidst the chanting of Vedic mantras between 1pm and 3pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్ – మస్కట్ గ్రేప్స్ – కొరియన్ పియర్స్

– ప్రత్యేక అలంకరణకు ఒక టన్ను కట్ ఫ్లవర్స్ మరియు పండ్లు

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 28: దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో, ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో జపాన్ నుండి యాపిల్స్, మస్కట్ నుండి ద్రాక్ష, కొరియా నుండి పియర్స్, థాయిలాండ్ నుండి మామిడి మరియు అమెరికా నుండి చెర్రీస్ కూడా స్వామివారి సేవలో తరించాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తితో వేలాది కిలోమీటర్ల లోని తమ స్వస్థలాల నుండి ఈ పండ్లు, పుష్పాలను స్వామివారికి సమర్పించారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ గార్డెన్ విభాగం ప్రత్యేక అలంకరణలు చేసింది. ఒక్క టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా శ్రీ మలయప్ప స్వామివారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మొట్టమొదటిసారిగా, ఫింగర్ మిల్లెట్ (రాగులతో) చేసిన మాల, పచ్చని పవిత్రాలు మరియు పగడపు మాలలతో పాటు స్నపన తిరుమంజనంలో ఏలకులు, వట్టి వేరు, ద్రాక్ష, తులసి దండలు కూడా స్వామి అమ్మవార్లకు అలంకరించారు.

గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఏడాది థాయ్‌లాండ్‌కు చెందిన లిచిస్‌, ఆస్ట్రేలియన్‌ పింక్‌, బ్లాక్‌ గ్రేప్స్‌, వివిధ దేశాలకు చెందిన పండ్లను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించినట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు చెన్నైకి చెందిన నైపుణ్యం గల పుష్ప కళాకారులు ప్రత్యేక అలంకరణలు చేశారు.

ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పవిత్రోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.