MALAYAPPA REAPPEARS IN GOLDEN ARMOUR _ శ్రీ‌వారి ఆల‌యంలో ముగిసిన జ్యేష్టాభిషేకం

Tirumala, 24 Jun. 21: The annual Jyestabhishekam otherwise known as Abhidyeyaka Abishekam was concluded on a grand religious note in Tirumala temple on Thursday.

Archaka swamis rendered Snapanam to the deities amidst chanting of Vedic hymns and conducted Homam afterwards.

Later Puja was conducted to Swarna Kavacham before they were decorated to the deities.

After Sahasra Deepalankara Seva the deities were taken on a celestial procession along four mada streets to bless devotees.

Pedda Jeeyar and Chinna Jeeyar Swamy of Tirumala, Specified Authority Chairman and TTD EO Dr KS Jawahar Reddy, Specified Authority Convenor and TTD Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, temple DyEO Sri Harindranath and others were also present.

POURNAMI GARUDA SEVA CANCELLED

In view of Jyestabhishekam, TTD has cancelled monthly Pournami Garuda Seva.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో ముగిసిన జ్యేష్టాభిషేకం

స్వర్ణ కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు

 తిరుమల, 2021 జూన్ 24: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం గురువారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పున‌ర్ద‌ర్శ‌న‌మిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు శ‌త‌క‌ల‌శ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ అనంత‌రం స్వామి, అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ ర‌ద్దు

జ్యేష్టాభిషేకం కార‌ణంగా గురువారం పౌర్ణ‌మి సంద‌ర్భంగా నిర్వ‌హించాల్సిన గ‌రుడ‌సేవ‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, క‌న్వీన‌ర్‌ శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ హ‌రీంద్ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.