TEPPOTSAVAMS CONCLUDES IN SRI PAT _ ముగిసిన తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి తెప్పోత్స‌వాలు

Tiruchanoor, 24 Jun. 21: The annual Teppotsavams in Tiruchanoor temple concluded on a grand note on Thursday.

Sri Padmavathi Devi Ammavaru was rendered Abhishekam in Sri Krishna Mukha Mandapam.

Due to Covid restrictions, instead of float festival in the temple tank Padmasarovaram holy waters, TTD conducted this annual fete in Ekantam within temple premises by carrying out Abhishekam between 2:30pm and 4pm.

Later in the evening Unjal Seva will be performed between 5pm and 6pm.

Temple DyEO Smt Kasturi Bai and other officials participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముగిసిన తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి తెప్పోత్స‌వాలు

తిరుపతి, 2021 జూన్ 24: తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు గురువారం ముగిశాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తికి అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఊంజ‌ల్ సేవ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి మ‌ల్లిశ్వ‌రి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.