EXTENSIVE ARRANGEMENTS MADE BY TTD KEEPING IN VIEW PILGRIMS SAFETY- CE _ శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భ‌క్తుల సౌక‌ర్యార్థం విస్తృతంగా ఇంజినీరింగ్ ఏర్పాట్లు : టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ రామ‌చంద్ర‌రెడ్డి

Tirumala, 7 Oct. 19: The Chief Engineer of TTD, Sri Ramachandra Reddy said that TTD had spent Rs.7.55 crore for making extensive arrangements for benefit of devotees during the ongoing Srivari annual Brahmotsavams at Tirumala.

Addressing reporters at the Media Centre on Monday, the CE said that a sum of Rs.3.46 crore was spent to spruce up toilets, bathrooms, drinking water taps etc. in the four mada street galleries and 10 million liters of clean water was pumped into the Srivari Pushkarini besides making comfortable arrangements in galleries, bhajan mandapams etc. for the sake of devotees.

Elaborate arrangements for the exhibition at the Kalyana Vedika were also made and rangoli, paintings along the mada streets and the Srivari Temple gave an enhanced look during the nine-day festival.

Special parking avenues were created for 8100 cars in Tirumala and 4700 two wheelers and 230 cars at Alipiri and Srivari Mettu respectively in Tirupati besides additional parking at 

Srivari Seva Sadan and Thiruvengadanpatham ring road on the Garuda seva day. About 35 lakh gallons of drinking water was supplied every day during Brahmotsavams and on Garuda seva day 43 lakh gallons was supplied.

ELECTRICAL WORKS OF Rs 3.29 CRORES

He said 4 LED electrical cutouts various deities were set up in Tirumala and 31 LED screens were put up at mada streets and other locations in Tirumala for devotees.

TTD PRO Dr T Ravi and SE (Electrical) Sri Venkakeswarlu and others participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

 

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భ‌క్తుల సౌక‌ర్యార్థం విస్తృతంగా ఇంజినీరింగ్ ఏర్పాట్లు : టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ రామ‌చంద్ర‌రెడ్డి

తిరుమల, 2019 అక్టోబ‌రు 07:  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ల‌క్ష‌లాదిగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా  మ‌రింత సౌకర్యావంతంగా స్వామివారి వాహ‌న‌సేవాలు వీక్షించేలా రూ. 7.55 కోట్లతో ఇంజినీరింగ్‌ ఏర్పాట్లు చేపట్టామని టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో సోమవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌లో రూ. 3.46 కోట్ల‌తో ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో గ్యాల‌రీల‌లోని మ‌రుగుదొడ్ల‌కు నీటి కుళాయిల ద్వారా నిరంత‌ర‌ము నీటి  స‌ర‌ఫారాకు చ‌ర్యలు తీసుకున్నామ‌న్నారు. శ్రీ‌వారి పుష్కరిణిలో 10 మిలియన్‌ లీటర్ల పరిశుభ్రమైన నీటిని నింపి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేసినట్టు తెలిపారు. వాహనసేవలు తిలకించేందుకు వచ్చిన భక్తులకు సౌకర్యవంతంగా గ్యాలరీలు, బారీకేడ్లు, నాలుగు మాడ వీధుల్లో భజనమండపాలను ఏర్పాటుచేశామన్నారు. శ్రీవారి ఆలయం, మాడ వీధుల్లో పెయింటింగ్‌, రంగోళిలు, ప్రదర్శనశాల కోసం ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు.  

 తిరుమ‌ల‌లో 8100 నాలుగు చ‌క్రాల వాహ‌నాలు, తిరుప‌తిలో గ‌రుడ‌సేవ‌నాడు అలిపిరి, శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద 4,700 ద్విచ‌క్ర వాహ‌నాలు, 230 నాలుగు చ‌క్రాల వాహ‌నాల కోసం తాత్కాలిక పార్కింగ్ ఏర్పాటు చేశామ‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో రోజుకు 35 ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీటి స‌ర‌ఫ‌రా, ప్ర‌త్యేకంగా గ‌రుడ‌సేవ నాడు 43 ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీటిని నిరంత‌రాయంగా స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు వివ‌రించారు. నూతన శ్రీవారి సేవాసదన్‌, తిరువేంకటపథం రింగ్‌ రోడ్డు వద్ద అదనంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టామన్నారు. 
 
ఎల‌క్ట్రిక‌ల్ విభాగం ఆధ్వ‌ర్యంలో రూ. 3.29 కోట్ల‌తో ఏర్పాట్లు –

 తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 41 ఎల్‌ఇడి విద్యుద్దీపాల కటౌట్లను ఆకట్టుకునేలా ఏర్పాటుచేశామని సిఈ తెలిపారు. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఎల్‌ఇడి దీపాలు, స్ట్రిప్స్‌ను ఏర్పాటుచేశామన్నారు. బ్రహ్మోత్సవ మహాప్రదర్శన వద్ద ప్రత్యేక లైటింగ్‌ను తీర్చిదిద్దామన్నారు. 

అదేవిధంగా రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ విభాగాము ద్వారా రూ.80 ల‌క్ష‌ల‌తో ఆల‌య నాలుగు మాడ వీధుల్లో, ఇతర ప్రాంతాల్లో  కలిపి మొత్తం 33 డిజిటల్‌ స్క్రీన్లను ఏర్పాటుచేశామన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి డా.టి.ర‌వి, ఎస్ఈ (ఎలక్ట్రికల్) శ్రీ వేంకటేశ్వర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.