ANNUAL PAVITROTSAVAMS POSTERS RELEASED

Tirupati, 7 Oct. 19: Tirupati JEO Sri P Basant Kumar on Monday released the annual Pavitrotsavams posters at Sri Pattabhiramalayam of Valmikipuram. 

The event took place in his chambers in TTD administrative building on Monday evening.  The annual event will be observed from October 12-14 with Ankurarpanam on October 11.

Temple DyEO Sri Ellappa was also present in the release event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి,  2019 అక్టోబరు 07: వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో సోమ‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

 ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ అక్టోబరు 11వ తేదీ శుక్ర‌వారం సాయంత్రం 5.00 నుండి 8.00 గంటల వరకు అంకురార్పణ ఘనంగా నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా అక్టోబరు 12వ తేదీ ఉదయం 7.00 గంటలకు యాగశాల పూజ, చతుష్టానార్చన, హోమం, పవిత్రప్రతిష్ఠ, నివేదన సాయంత్రం 5.30 గంట‌ల నుండి యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అక్టోబరు 13న ఉదయం పవిత్రసమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు,  అక్టోబరు 14న ఉదయం యాగశాల పూజ, మహాపూర్ణాహుతి, స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తామ‌న్నారు. రాత్రి తిరువీధి ఉత్సవం, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగియనున్న‌ట్లు తెలిపారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్ధ ప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ య‌ల్ల‌య్య‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ మోహ‌న్‌రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.