SRI SUBRAHMANYA SWAMY HOMAM CONCLUDES AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం
Tirupati, November 13, 2026: As part of the month-long Karthika Masa Homa Mahotsavams at Sri Kapileswara Swamy Temple in Tirupati, Sri Subrahmanya Swamy Homam concluded on Friday with religious fervour.
Special pujas, homam, Maha Purnahuti and Kalasa rituals were performed from 9 am to 12 noon, followed by Maha Abhishekam, Kalasabhishekam and Harathi to the deity.
Dharma Sastha Swamy Homam on November 14
Sri Dharma Sastha Swamy Homam will be performed on Saturday. Devotees can participate by paying Rs.500. Each participating couple will be given one uttariyam, one blouse piece and Annaprasadam.
Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Chandrasekhar, priests and a large number of devotees participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీ కపిలేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం
తిరుపతి, 2026 నవంబరు 13: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం వైభవంగా ముగిసింది.
ఈ సందర్భంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో విశేష పూజలు, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన నిర్వహించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి సమర్పించారు.
నవంబరు 14న శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం
హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 14వ తేదీ శనివారం శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం నిర్వహించనున్నారు. గృహస్తులు రూ.500 చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







