GRAND ANNABHISHEKAM PERFORMED AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ వైభవంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి అన్నాభిషేకం

DEVOTEES BLESSED WITH ANNA LING DARSHAN

Tirupati, October 26, 2026: The Annabhishekam festival was performed with religious fervour at Sri Kapileswara Swamy Temple in Tirupati on Monday.

The rituals included holy water abhishekam, Annabhishekam and Deeparadhana in the morning. Anna Linga Darshan was provided to devotees from 3 PM. After the rituals, annaprasadam was distributed, followed by temple purification and a fragrant abhishekam in the evening.

TTD JEO Dr A. Sharath, Deputy EO Smt. Nagaratna, AEO Smt. Kumari Devi, Superintendent Sri Chandrasekhar, temple priests and a large number of devotees participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

వైభవంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి అన్నాభిషేకం

అన్నంతో అలంకరించిన శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు

తిరుపతి, 2026 అక్టోబరు 26: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం అన్నాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నంతో అలంకరించిన పరమశివుని దర్శించుకునే పవిత్ర అవకాశం భక్తులకు కల్పించారు.

శాస్త్రోక్తంగా అభిషేకాది కార్యక్రమాలు

ఈ సందర్భంగా ఉదయం ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, అన్నాభిషేకం, దీపారాధన నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు.

దర్శనం అనంతరం ఏకాంతంగా ఉద్వాసన కార్యక్రమం నిర్వహించి, అన్నప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ శుద్ధి చేపట్టి, సాయంత్రం సుగంధద్రవ్య అభిషేకం నిర్వహించి, అదే సమయంలో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. 

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఏ. శరత్, డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీమతి కుమారి దేవి, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.