KASULA HARAM DECKED _ శ్రీ కల్యాణ వెంకన్నకు తిరుమ‌ల‌ శ్రీవారి లక్ష్మీకాసులహారం

TIRUMALA, 24 FEBRUARY 2022: The famous Lakshmi Kasula Haram was brought from Tirumala to Srinivasa Mangapuram on the occasion of Garuda Seva on Thursday.

 

The Additional EO of TTD Sri AV Dharma Reddy handed over the precious ornament which was first decked to Mula virat and later decorated to Garuda Vahana in the evening.

 

Jeo Sri Veerabrahmam, DyEO Smt Shanti and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

శ్రీ కల్యాణ వెంకన్నకు తిరుమ‌ల‌ శ్రీవారి లక్ష్మీకాసులహారం

తిరుపతి, 2022 ఫిబ్రవరి 24: తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం గురువారం సాయంత్రం శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంకు అదనపు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి దంపతులు తీసుకువచ్చారు.

ఆలయం వద్ద తిరుపతి జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా అదనపు ఈవోకు స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మూలమూర్తికి అలంకరించారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, శ్రీనివాసమంగాపురం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, పేష్కార్ శ్రీ శ్రీహరి, బొక్క‌సం బాధ్యులు శ్రీ గురురాజారావు, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజి రంగ‌చార్యులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది