TTD CHAIRMAN UNVEILS BOOKLETS OF SRI KALYANA VENKATESWARA SWAMY ANNUAL BRAHMMOTSAVAMS _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్

Tirupati, 20 February 2024: TTD Board Chief Sri Bhumana Karunakara Reddy unveiled the booklets of the annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy Temple at  Srinivasa Mangapuram on Tuesday evening at Sri Padmavathi Rest House in Tirupati.

The nine-day fest of Brahmotsavam starts with Dwajarohanam on February 29 with Ankurarpanam on the evening of February 28. Important days includes, Garuda Vahanam on March 4, Swarnaratham on March 5, Rathotsavam on March 7 and Chakrasnanam on March 8.

TTD JEO Sri. Veerabraham, temple Special Grade DyEO Smt. Varalakshmi, others participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్

తిరుపతి, 20 ఫిబ్రవరి 2024: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.

ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఫిబ్రవరి 29న ధ్వజారోహణం(మీన‌ల‌గ్నం), మార్చి 4న గరుడ వాహనం, మార్చి 5న స్వర్ణరథం, మార్చి 7న రథోత్సవం, మార్చి 8న చక్రస్నానం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ, సీఏఓ శ్రీ శేషశైలేంద్ర, చీఫ్ పీఆర్వో డా.టి.రవి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, రవాణా జిఎం శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.