ANKURARPANAM FOR PAVITHROTSAVAMS PERFORMED AT SRINIVASA MANGAPURAM _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, November 4, 2026: Ankurarpanam for the three-day annual Pavithrotsavams of Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram, was performed as per tradition on Wednesday evening. The rituals included Mrutsangrahanam and Senadhipathi Utsavam.
The Pavithrotsavams will be held from November 5 to 7. Pavitra Pratishtha will be performed on November 5, Pavitra Samarpana on November 6 and Purnahuti on November 7.
Snapana Tirumanjanam will be performed to the processional deities on all three days, and a procession will be held on November 6 at 5 PM.
Householders can participate in the Arjitha Seva by paying ₹516 for two persons. TTD has cancelled Tiruppavada Seva on November 5 and Arjitha Kalyanotsavam from November 5 to 7.
Temple Special Grade Deputy EO Smt. Varalakshmi, AEO Sri Gopinath, Temple Inspector Sri Dhanasekhar and other officials participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
- oplus_0
- oplus_2097152
- oplus_0
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2026 నవంబరు 04: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.
ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన నవంబరు 5వ తేదీ ఉదయం 8.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ చేపడతారు. రెండో రోజైన నవంబరు 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. చివరిరోజైన నవంబరు 7వ తేదీ రాత్రి 8.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
స్నపన తిరుమంజనం, వీధి ఉత్సవం
పవిత్రోత్సవాల్లో భాగంగా నవంబరు 5, 7వ తేదీలలో ఉదయం 11 గంటలకు, నవంబరు 6వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
అదేవిధంగా నవంబరు 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్వామివారు, అమ్మవార్ల వీధి ఉత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 5వ తేదీ తిరుప్పావడ సేవ, నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గోపినాథ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



