SRIVARI LADDU AND VADA DISTRIBUTION TO RETIRED TTD EMPLOYEES FROM NOVEMBER 7 TO 20 _ నవంబరు 7 నుండి 20వ తేదీ వరకు టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ
Tirupati, November 4, 2026: TTD will distribute Srivari Laddu and Vada Prasadams to retired employees and family pensioners from November 7 to 20.
The distribution will be held at New Jabali Bhavan, near the TTD Canteen, Tirupati, from 10:30 AM to 5 PM. Pensioners can collect one big laddu and one vada by showing their smart cards.
Distribution will be based on PPO numbers as per the scheduled dates announced by TTD.
TTD requests all retired employees and family pensioners to collect the prasadam accordingly.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
నవంబరు 7 నుండి 20వ తేదీ వరకు టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ
తిరుపతి, 2026 నవంబరు 04: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబరు 7 నుండి 20వ తేదీ వరకు అందించనున్నారు. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. పింఛన్‌దార్లు తమ స్మార్టు కార్డు చూపి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ పొందవచ్చు.
పిపిఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. నవంబరు 7న 164 నుండి 3,250 వరకు, నవంబరు 9 నుండి 13వ తేదీ వరకు 3,251 నుండి 9,050 వరకు, నవంబరు 16 నుండి 19వ తేదీ వరకు 9,051 నుండి 12,550 వరకు, నవంబరు 20న 12,551 నుండి మిగిలిన పింఛన్‌దారులందరికీ ప్రసాదాలు అందిస్తారు.
విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
