SRI RAMANAVAMI FESTIVITES _ శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Tirupati, 17 April 2024: The Sri Rama Navami festival was observed with celestial fervour in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Wednesday.

Snapana Tirumanjanam was observed to the deities of Sri Sita Rama Lakshmana and Hanumantha in the morning.

While in the evening between 3pm and 4pm Asthanam was performed where HH Sri Pedda Jeeyar Swamy of Tirumala presented new Vastrams to the presiding deity as well to the Utsava deities.

In the evening Sri Rama will take a celestial ride on Hanumanta Vahana.

DyEO Smt Nagaratna and other temple staff, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

తిరుపతి, 2024 ఏప్రిల్ 17: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.

తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఊంజల్‌ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠం నుండి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకొని విమాన ప్రదక్షిణగా వచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తరువాత శ్రీరామ జన్మపురాణం, ఆస్థానం నిర్వహించారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.