JYESTABHISHEKAM COMMENCES IN SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం ప్రారంభం

TIRUPATI, 19 JULY 2021: The annual Jyestabhishekam also known as Abhidyeyaka Abhishekam commenced in Sri Govindaraja Swamy temple in Tirupati on Monday.

After morning rituals like, Satakalasa Snapanam and Mahashanti Homam, Snapana Tirumanjanam was performed to Utsava deities and in the evening, procession on Tiruchi will take place.

Due to Covid norms, the event is taking place in Ekantam.

Both the senior and junior pontiffs of Tirumala, Special Grade DyEO Sri Rajendrudu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం ప్రారంభం

తిరుపతి, 2021 జూలై 19: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం సోమ‌వారం ప్రారంభమైంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు శ‌త‌క‌ల‌శ స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. ఆ త‌రువాత ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ల‌తో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం 5 గంట‌ల‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచ్చిపై ఆలయ విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌డ‌తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, ఆల‌య ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ మునీంద్ర‌బాబు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.