COMPLETE PLASTIC BAN IN TIRUMALA IN TWO MONTHS- ADDITIONAL EO _ తిరుమ‌ల‌కు ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లు తీసుకురావ‌ద్ద‌ని భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

TIRUMALA, 19 JULY 2021: Tirumala will be made a plastic-free zone in two months, said TTD Additional EO Sri AV Dharma Reddy.

During a review meeting held with HoDs of Tirumala on Monday at Annamaiah Bhavan in Tirumala, the Additional EO directed all the heads of various departments to ensure a complete plastic ban in Tirumala.

He said, the pilgrims should be oriented widely on not to carry plastic bottles to Tirumala. The Additional EO also instructed the officials concerned to have thorough checks of vehicles at Alipiri itself so as to prevent pilgrims from carrying plastic bottles to Hill town.

He also asked the concerned HoDs to ensure that no plastic bottles will be sold in Tirumala. “All the rest houses in Tirumala should keep ready steel jars and mugs apart from Jalaprasadam water units. These steel jars and mugs should be cleaned thoroughly at regular intervals. Even the commercial outlets should keep ready glass, copper and steel bottles for the sake of pilgrims. All the locals and shopkeepers should cooperate in this TTD’s mission to ban usage of plastic in Tirumala”, he maintained. 

DyEOs Sri Vijayasaradhi, Sri Harindranath, Sri Bhaskar, Additional Health Officer Dr Sunil Kumar, EEs Sri Srihari, Sri Mallikarjuna Prasad, DE Electrical Smt Saraswathi were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌కు ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లు తీసుకురావ‌ద్ద‌ని భ‌క్తుల‌కు విజ్ఞ‌ప్తి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2021, జులై 19: తిరుమల ప‌విత్ర‌త‌ను, స్వ‌చ్ఛ‌త‌ను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామ‌ని, భ‌క్తులు ఈ విష‌యాన్ని గుర్తించి ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లు తీసుకురావ‌ద్ద‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం వివిధ విభాగాల అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌కు ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లు చేర‌కుండా అలిపిరి చెక్‌పాయింట్ వ‌ద్ద త‌నిఖీలు చేసి వాటిని తొల‌గిస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లోని దుకాణాల్లో ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల‌ను విక్ర‌యించ‌కూడ‌ద‌న్నారు. వీటికి ప్ర‌త్యామ్నాయంగా గాజు, కాప‌ర్‌, స్టీల్ వాట‌ర్ బాటిళ్లు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచాల‌ని కోరారు. 2 నెల‌ల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి తిరుమ‌ల స్థానికులు, వ్యాపారులు స‌హ‌క‌రించాల‌న్నారు. భ‌క్తుల అవ‌స‌రాల కోసం అన్ని కాటేజీల్లో జ‌ల‌ప్ర‌సాదం తాగునీరు, జ‌గ్గులు, గ్లాసులు ఏర్పాటు చేశామ‌న్నారు. స‌ద‌రు జ‌గ్గులు, గ్లాసుల‌ను ప్ర‌తిరోజూ శుభ్రం చేస్తున్న‌ట్టు చెప్పారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, డెప్యూటీ ఈవోలు శ్రీ విజ‌య‌సార‌థి, శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్‌, ఇఇలు శ్రీ శ్రీ‌హ‌రి, శ్రీ మ‌ల్లికార్జున‌ప్ర‌సాద్‌, డిఇ శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.