JEO REVIEWS MAHA SAMPROKSHANAM OF SRI GT _ శ్రీ గోవిందరాజస్వామి విమానగోపుర మహాసంప్రోక్షణ, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవో సమీక్ష 

ALSO REVIEWS BRAHMOTSAVAM ARRANGEMENTS

TIRUPATI, 17 MAY 2023: As the Maha Samprokshanam for the gold malam of Vimana Gopuram in Sri Govindaraja Swamy temple are scheduled between May 21-25 followed by annual brahmotsavams from May 26 onwards till June 3, TTD JEO Sri Veerabrahmam reviewed the ongoing arrangements for both the events with the officials concerned.

The meeting was held in the chamber of the JEO on Wednesday evening in TTD Administrative Building in Tirupati. The officials of Sri GT said in connection with the Maha Samprokshanam, Unjal seva has been cancelled from May 20-25 in the temple. 

Later the JEO instructed the concerned of the respective departments to make elaborate arrangements of floral and electrical decorations for the mega annual festival, identifying Harati points all along the mada streets,  proper security, services by Srivari Sevaks etc, Annaprasadam and water distribution, dharmic and devotional cultural programs etc.

FACAO Sri Balaji, CE Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu, DyEOs Smt Shanti, Sri Govindarajan, EE Sri Manoharam, VGO Sri Manohar, Additional Health Officer Dr Sunil and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామి విమానగోపుర మహాసంప్రోక్షణ, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవో సమీక్ష
 
– ఏర్పాట్ల పరిశీలన
 
తిరుపతి 17 మే 2023: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మే 21 నుంచి 25వ తేదీ వరకు  బంగారు తాపడం విమాన గోపురం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయి. అలాగే మే 26 నుంచి జూన్ 3వ  తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ రెండు కార్యక్రమాల  ఏర్పాట్లపై జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులతో బుధవారం రాత్రి ఆలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు.
 
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, మహాసంప్రోక్షణకు మే 20న అంకురార్పణ జరుగుతుందన్నారు. మే 21 నుంచి 24వ తేదీ వరకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు . మే 25న పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ నిర్వహిస్తామని వివరించారు. ఇందుకోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై విభాగాల వారీగా అధికారులతో సమీక్షించినట్లు ఆయన చెప్పారు. మహా సంప్రోక్షణ కారణంగా మే 20 నుంచి 25వ తేదీ వరకు ఆలయంలో ఊంజల్ సేవను రద్దు చేసినట్లు తెలిపారు. 
 
బ్రహ్మోత్సవాలకు అన్ని విభాగాల అధికారులు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మే 25న అంకురార్పణ జరుగుతుందన్నారు. మాడవీధుల్లో హారతి పాయింట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై అధికారులతో కలిసి పరిశీలించారు. గాంధీ రోడ్ లో వైర్లను  తొలగించేందుకు ఎస్పిడిసిఎల్, బిఎస్ఎన్ఎల్ విభాగాల అధికారులను ముందుగానే సంప్రదించాలన్నారు. ఆలయంలో శోభాయమానంగా పందిళ్లు, రంగవల్లులు, విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని సూచించారు. ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. 
 
టీటీడీ ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజీ, సిఈ శ్రీ  నాగేశ్వరరావు, ఎస్ఈ ఎలక్ట్రికల్స్ శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీమతి శాంతి, శ్రీ గోవిందరాజన్, ఈఈ శ్రీ మనోహర్, విజివో శ్రీ మనోహర్, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.