VARAHA JAYANTI OBSERVED _ తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి

Tirumala, 13 September 2026:The annual Varaha Jayanti was observed with spiritual fervour in Tirumala on Sunday.

Abhishekam was performed to the presiding deity of Sri Bhu Varaha Swamy in the temple located adjacent to Swamy Pushkarini.

TTD EO Sri Muddada Ravi Chandra, Additional EO Sri Ch. Venkaiah Chowdary and other temple officials, priests participated in this fete.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి

తిరుమల, 2026 సెప్టెంబర్ 13: ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.