MALLADI VISHNU TAKES TTD OATH _ శ్రీ మల్లాది విష్ణు పదవీ ప్రమాణ స్వీకారం

Tirumala, 25 March 2021: Vijayawada central MLA Sri Malladi Vishnu took oath as a special invitee of the TTD board at the Srivari temple on Thursday morning.

He was served oath of office at the Jaya-Vijaya portico of Srivari temple by the Additional EO Sri AV Dharma Reddy.

Thereafter the TTD Veda pundits served Veda Ashir Vachanam and the Additional EO presented Srivari thirtha Prasadam and portrait at the Ranganayakula Mandapam.

Speaking to media outside the temple the legislator expressed his gratitude to AP chief minister Sri YS Jaganmohan Reddy for nor appointment to the TTD board and that he prayed Sri Venkateshwara to shower prosperity and health for all in the state.

He also thanked endowment minister Sri V Srinivasa Rao and TTD chairman Sri YV Subba Reddy for supporting his appointment.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శ్రీ మల్లాది విష్ణు పదవీ ప్రమాణ స్వీకారం

తిరుమల 25 మార్చి 2021: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలోని జయవిజయుల వద్ద అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఉదయం 7 గంటలకు శ్రీ మల్లాది విష్ణు తో ప్రమాణం చేయించారు. అనంతరం అధికారులు ఆయనకు స్వామివారి దర్శనం చేయించారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వాదం చేశారు. శ్రీ ధర్మారెడ్డి ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందించారు.

సిఎం కు కృతజ్ఞతలు

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా తనను నియమించిన ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి శ్రీ విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

తన నియామకానికి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెలం పల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది