131st BIRTH ANNIVERSARY OF SRI RALLAPALLI ANANTHAKRISHNA SHARMA OBSERVED _ శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ సంగీత సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి : ఆచార్య రాళ్లపల్లి దీప్త

Tirupati, 23 January 2024: Acharya Rallapalli Deepta, Head of the Department of English, National Sanskrit University, recalled the efforts of versatile scholar Sri Rallapalli Ananthakrishna Sharma, who had immense knowledge in the fields of music and literature, and was a versatile scholar in the history of music and literature. 

 

The 131st birth anniversary program of Sri Rallapalli Ananthakrishna Sharma was celebrated on Tuesday evening at the Annamacharya Kalamandiram in Tirupati under the joint auspices of TTD Annamacharya Project and Hindu Dharmic Projects.

 

On this occasion, Acharya Rallapalli Deepta gave a keynote speech and said that music and literature were like two eyes to Sri Anantakrishna Sharma.

 

Eminent orator Shri Rallapalli Pradyumna said, Sri Rallapalli knew many languages, and had a vast knowledge of Vaishnavism,  and brought the kirtans of Annamacharya etched on the copper plates to light in a very authentic way.  He said that the first volume of 120 Annamaiah kirtans composed by him was printed in 1952 and the second volume in 1956.

 

Earlier, in the morning, TTD officials paid floral tributes to the statue of Sri Rallapalli Anantha Krishna Sharma located on Sri Padmavati Mahila University road.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ సంగీత సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి : ఆచార్య రాళ్లపల్లి దీప్త

•⁠ ⁠ఘనంగా శ్రీ అనంతకృష్ణశర్మ 131వ జయంతి

తిరుపతి, 2024 జనవరి 23: సంగీత, సాహిత్య రంగాల్లో అపారమైన జ్ఞానం ఉన్న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ సంగీత చరిత్ర, సాహిత్య చరిత్రలో బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన మనవరాలు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖ విభాగాధిపతి ఆచార్య రాళ్లపల్లి దీప్త కొనియాడారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాయంత్రం శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 131వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆచార్య రాళ్లపల్లి దీప్త అధ్యక్షోపన్యాసం చేస్తూ శ్రీ రాళ్లపల్లి వారికి సంగీతం, సాహిత్యం రెండు కళ్లు లాంటివని చెప్పారు.
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచారని తెలిపారు. రాగి రేకుల్లో పేర్కొన్న రాగాలతోనే కీర్తనలు స్వరపరిచారని, ఈ రాగాలు ప్రస్తుతం లేకపోయినా అన్నమయ్య కాలం నాటి సమకాలీన సంగీతాన్ని దృష్టిలో ఉంచుకుని బాణీలు కూర్చారని తెలియజేశారు. ఈయనకు సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, కన్నడ భాషల్లో మంచి పాండిత్యం ఉందన్నారు.
ఈ కారణంగానే అన్నమయ్య రాగిరేకుల్లోని సాహిత్యాన్ని చక్కగా అర్థం చేసుకుని పరిష్కరించారని వివరించారు.

ప్రముఖ వక్త శ్రీ రాళ్లపల్లి ప్రద్యుమ్న మాట్లాడుతూ,
శ్రీ రాళ్లపల్లి వారికి ఎక్కువ భాషలు తెలిసి ఉండడం, రాయలసీమ వ్యక్తి కావడం, వైష్ణవతత్వంపై అవగాహన ఉండడంతో అన్నమయ్య రాగిరేకుల్లోని కీర్తనలను ఎంతో ప్రామాణికంగా వెలుగులోకి తీసుకొచ్చారని తెలియజేశారు. ఆయన స్వరపరిచిన 120 అన్నమయ్య కీర్తనలను 1952లో మొదటి సంపుటం,1956లో రెండవ సంపుటం ముద్రించినట్లు తెలిపారు. అన్నమయ్య కీర్తనలోని కృతులు, రాగాలు, మాండలికాలు , క్లిష్టమైన పదాలకు అర్ధాలతో స్వరపరిచారని వివరించారు.

పుష్పాంజలి :

కాగా, ఉదయం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మార్గంలోని శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.