MAHA SHANTI TIRUMANJANAM HELD _ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాశాంతి తిరుమంజనం 

TIRUPATI, 13 MAY 2023: In connection with Maha Samprokshanam ritual in the historical Sri Lakshmi Narasimha Swamy temple at Kapila Theertham in Tirupati on Sunday,  Maha Shanti Homam was observed on Saturday.

 

Purifactory rituals like Panchagavyadhivasam, Ksheeradhivasam, Jaladhivasam, Bimbasthapana, Koil Alwar Tirumanjanam were performed.

 

Vaikhanasa Agama Advisor Sri Mohana Rangacharyulu, DyEO Sri Devendra Babu and other temple staff were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాశాంతి తిరుమంజనం
 
మే 13, తిరుపతి, 2023:  తిరుపతి  కపిలతీర్థంలో గల పురాతన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు.
 
ఇందులో భాగంగా ఉదయం యాగశాల వైదిక  కార్యక్రమాలు, అక్షిణ్మోచనం, పంచగవ్యాధివాసం, క్షీరాదివాసం, జలాధివాసం, రత్నన్యాసం, బింబస్థాపన, అష్టబంధన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం బింబవాస్తు, నవ కలశ చతుర్దశ కలశ స్నపనం, మహాశాంతి, తిరుమంజనం, పూర్ణాహుతి, శయనాధివాసం నిర్వహించారు.
 
మే 14న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
 
ఈ కార్యక్రమంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి,  టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రవికుమార్  పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.