శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు  

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు  

తిరుపతి, 2026 సెప్టెంబ‌రు 08: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగ‌ళ‌వారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

ఉదయం 5 గంట‌ల‌కు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మ‌వార్ల‌ మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, గ‌రుడాళ్వారుకు, ప‌రివార దేవ‌త‌ల‌కు పవిత్రమాలలు సమర్పించారు.

సాయంత్రం 5.30 గంటలకు తిరువీధి ఉత్సవం, యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి.    

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య సూప‌రింటెండెంట్ శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్ప్‌క్ట‌ర్ శ్రీ వీరాస్వామి, ఆల‌య అర్చ‌కులు, విశేష షంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.