VENUGOPALA GLIDES ON SARVABHOOPALA _ సర్వభూపాల వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి
TIRUMALA, 15 OCTOBER 2026: Sri Malayappa as Sri Venugopala while Sridevi and Bhudevi guised as Rukmini Satyabhama glided on Sarvabhoopala Vahanam on Thursday evening.
The carrier represented the Universal Supremo and His mightiness.
Both the Pontiffs of Tirumala, TTD authorities, board members were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
సర్వభూపాల వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి
భక్తిభావంతో పరవశించిన తిరుమల మాడ వీధులు
తిరుమల, అక్టోబరు 15, 2026: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా విహరించి భక్తులను అనుగ్రహించారు.
గజరాజుల ముందు నడక.. మంగళవాయిద్యాల నడుమ వైభవం
వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తబృందాల చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టి, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అంగరంగ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.
సర్వభూపాల వాహనసేవలో విశేష ఆధ్యాత్మిక సందేశం
సర్వభూపాల అంటే సమస్త రాజులు అని అర్థం. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, పరమేశ్వరుడు లోకాలను పరిరక్షించే శక్తులకు ప్రతీకలుగా నిలుస్తారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై మోస్తూ సేవించడం ఈ వాహనసేవ ప్రత్యేకత.
ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలిస్తూ, భగవంతుని ఆశీస్సులతో లోకక్షేమానికి కృషి చేయాలనే సందేశాన్ని సర్వభూపాల వాహనసేవ చాటిచెబుతుంది.
శుక్రవారం ఉదయం మోహినీ అవతారం.. రాత్రి గరుడసేవ
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మోహినీ అవతారంలో, రాత్రి గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శ్రీమతి జానకిదేవి, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ నరేష్ కుమార్, శ్రీ పూర్ణ సాంబశివరావు, జేఈవోలు డా. ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

















