TRIAL RUN OF NEW GOLDEN CHARIOT _ ప్రయోగాత్మకంగా నూతన స్వర్ణరథం ఊరేగింపు

Tirumala, 30 Sep. 13: The newly designed Swarna Ratham is taken out on trial run along mada streets on Monday in Tirumala by TTD. The procession commenced from SV Museum to newly built Swarna Rathotsava Mandapam via north-east-west mada streets.

Speaking on this occasion Tirumala JEO Sri K.S.Sreenivasa Raju said that this trial run will help to rectify defects if any before it is used during Brahmotsavam.

CVSO Sri GVG Ashok Kumar, Addl CVSO Sri Siva Kumar Reddy, Chief Engineer Sri Chandrasekhar Reddy, SE’s Sri Ramesh Reddy, Sri Sudhakar Rao,Temple DyEO Sri Chinnamgari Ramana Peishkar Sri R.Selvam and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI  
ప్రయోగాత్మకంగా నూతన స్వర్ణరథం ఊరేగింపు

తిరుమల, 30  సెప్టెంబరు 2013 : అక్టోబర్‌ 5వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు నిర్వహించే స్వర్ణరథం ఊరేగింపును పురస్కరించుకొని సోమవారంనాడు తితిదే ప్రయోగాత్మకంగా నూతన స్వర్ణరథం ఊరేగింపు చేపట్టింది.
 
ఆగష్టు నెల 26వ తారీఖున ప్రారంభమైన నూతన స్వర్ణరథం బంగారు తాపడం పనులు ఈ నెల 27వ తారీఖున తుది మెరుగులు దిద్దుకున్నది. దాదాపు 32 అడుగుల ఎత్తుగల ఈ స్వర్ణరథం దేశంలోనే అతిపెద్దది కావడం విశేషం. తమిళనాడుకు చెందిన 15 మంది స్వర్ణకారులు రేయింబవళ్ళు శ్రమించి నూతన స్వర్ణరథాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.
తితిదే తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం ఉదయం 9.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర పురాతన వస్తు ప్రదర్శనశాల నుండి స్వర్ణరథం ఊరేగింపు ప్రారంభమైంది. సివిఎస్‌వో ఆధ్వర్యంలో విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసు సిబ్బంది, శ్రీవారి సేవకులు రథాన్ని గమ్యస్థానానికి చేర్చడంలో తోడ్పడ్డారు.
 
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ పడమర, ఉత్తర, తూర్పు మాడవీధుల మీదుగా నూతనంగా నిర్మించిన స్వర్ణరథ మండపంలోనికి స్వర్ణరథాన్ని చేర్చినట్టు తెలిపారు. ప్రయోగాత్మక ఊరేగింపులో ఎదురైన సమస్యలను అధ్యయనం చేసి వచ్చే బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వర్ణరథం ఊరేగింపు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తితిదే చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ, ఎస్‌ఈలు శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీ సుధాకర్‌రెడ్డి, హెల్త్‌ ఆఫీసర్‌ శ్రీ వెంకటరమణ, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.