GRAND FINALE OF SRIVARI NAVARATRI BRAHMOTSAVAM WITH TRADITIONAL SRI CHAKRA TIRUMANJANAM _ చ‌క్ర‌స్నానంతో ముగిసిన శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

Tirumala, 24 Oct. 20: Heralding the finale on the early morning of Saturday the Day 9 of the Srivari Navaratri Brahmotsavams, Sri Malayappa Swamy blessed devotees on Pallaki vahanam.

Thereafter the most revered phase of Srivari Brahmotsavam, the chakrasnanam was performed. The Archakas dipped the Sri Sudarshan chakrathalwar for a holy bath in the newly built Pushkarini near Ayina Mahal inside Srivari temple.

As part of the state and central government Covid-19 guidelines, the concluding events of Srivari Navaratri Brahmotsavam were also observed in ekantham.

PALLAKI VAHANA SEVA

In the early hours, Pallaki vahana Seva was observed at the Kalyanotsava Mandapam with the majestically decorated Utsava idols of Sri Malayappa and his consorts. 

Speaking on the occasion TTD EO Dr KS Jawahar Reddy said the Srivari Navaratri Brahmotsavam concluded with the chakrsnanam for the utsava idols of Sri Malayappa and his consorts besides the Sri Sudarshan Chakrathalwar.

He said earlier as per Agama traditions the Snapana thirumanjanam was performed to the utsava idols.

The TTD EO said the Bangaru Tiruchi utsava will be held at night and lauded the Tirumala Pontiffs Jeeyangar swamys, temple priests, TTD officials and other staff who made the festival a grand success.

SNAPANA TIRUMANJANAM

As the last but one event of the Srivari Navaratri Brahmotsavam, grand Snapana thirumanjanam was was conducted at the Ayina mahal mandapam. The Snapanam is part of Agama traditions as a revered practice ahead of Chakra Snanam.

The Snapana Tirumanjanam to Sri Malayppa Swamy, Sridevi, Bhudevi and Sri Sudarshana Chakrattalwar was performed in a grand manner amidst chanting of Veda Mantras. Panchabhisheka Snanam with milk, curd, honey, turmeric and sandal paste was rendered to deities.

The TTD Veda parayanadars chanted Dasharathi Shanti Mantra, Purusho Suktam, Sri Suktam, Bhu Suktam, Nila Suktam, and Vishnu Suktam on the occasion in this garlands made of colourful ritual high-quality flowers of each season were showered on the utsav idols.

CHAKRASNANAM

The holy tradition, heralding the conclusion. Of the nine day long performed in a religious mode inside the Srivari temple on Saturday morning.

In view of the Covid 19 restrictions, the sacred event tagged was performed in a newly constructed Pushkarini (temple tank) inside the temple facing Ayina Mahal where the Snapana Tirumanjanam to the deities was also conducted.

According to Legends, the Sudarshana Chakra is a spinning, disk-like weapon of Lord Maha Vishnu with 108 serrated edges. The Chakra is often depicted as an Ayudhapurusha (Anthropomorphic form). 

The Sudarshana Chakkrattalwar was brought ceremoniously to the temple tank and immersed in the holy waters in the sacred muhurtam. 

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Dr KS Jawahar Reddy, Deputy Speaker Sri Kona Raghupathi, MP Sri Vemireddy Prabhakar Reddy, Additional EO Sri AV Dharma Reddy, Board members Dr Nischitha, Sri Chippagiri Prasad, Sri Govind Hari, Sri DP Ananth, Smt Prasanthi Reddy, Sri Kupendra Reddy, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.

BANGARU TIRUCHI UTSAVAM

In the night Bangaru Tiruchi Utsavam is performed in which the utsava idols of Lord Malayappa and his consorts were taken out in a procession inside the Srivari temple and asthanam conducted at the Ranganayakula mandapam

PARVETA UTSAVAM ON OCTOBER 25

TTD is organising the annual Parveta utsavam in the Kalyanotsava Mandapam of Srivari temple on Sunday, October 25.

The utsava idols of Sri Malayappa and his consorts Sridevi and Sri Bhudevi will be seated in Asthanam at the Ranganayakula Mandapam.

The Utsava is also conducted in Ekantham inside Srivari temple in View of COVID-19 guidelines.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

చ‌క్ర‌స్నానంతో ముగిసిన శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని శ్రీ చ‌క్ర తిరుమంజ‌నం

తిరుమల, 2020 అక్టోబ‌రు 24: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌ని‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు జ‌రిగిన న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిశాయి. ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్ ఎదురుగా నూత‌నంగా ఏర్పాటు చేసిన  చిన్న పుష్క‌రిణిలో ఆల‌య అర్చ‌కులు సుదర్శన చక్రాన్ని ముంచి, ప‌విత్ర స్నానం చేయించారు. 

ఈ సంద‌ర్భంగా ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి అనుగ్ర‌హంతో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన శ‌నివారం ఉదయం 6.00 గంటల నుండి శ్రీ‌వారి ఆల‌యంలోని అయిన మ‌హ‌ల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారని తెలిపారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించార‌న్నారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్స‌వంతో శ్రీ వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ‌ని వివ‌రించారు. బ్ర‌హ్మోత్స‌వాలు నిర్విఘ్నంగా నిర్వ‌హించిన జీయ్యంగార్లు, ఆల‌య అర్చ‌కులు, అధికారులు, సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

స్న‌ప‌న తిరుమంజ‌నం సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం  చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
 
చక్రస్నానం – లోకం క్షేమం

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల‌తో ఉండడానికీ చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.

ఈ కార్య‌క్ర‌మంలో పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతిరెడ్డి, శ్రీ కుపేంద్ర‌రెడ్డి, డా. నిశ్చిత‌, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

అక్టోబ‌రు 25న పార్వేట ఉత్సవం –

అక్టోబ‌రు 25వ తేదీ ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ‌వారి పార్వేట ఉత్సవం నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి, స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేంచేపు చేస్తారు.  కోవిడ్ – 19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.   

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.