END OF PANDEMIC WITH THE BLESSINGS OF SRIVARU AND DURGAMATA-TTD CHAIRMAN _ దుర్గమ్మ దయతో కరోనా తొలగిపోవాలి- టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దసరా శుభాకాంక్షలు
EXTENDS DASARA GREETINGS
Tirumala, 24 Oct. 20: While extending Dasara Greetings to devotees on Saturday, TTD Chairman Sri YV Subba Reddy said the blessings of Sri Venkateshwara and Goddess Sri Kanaka Durga will bring prosperity and relief from Covid-19 to entire humanity soon.
The Chairman said always divine elements surpass the evil forces as evinced in the mythological victory of Sri Goddess Durga over demon Mahishasura. Similar manner, the evil pandemic will soon end.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి దయతో అందరికీ విజయాలు చేకూరాలి
దుర్గమ్మ దయతో కరోనా తొలగిపోవాలి
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దసరా శుభాకాంక్షలు
తిరుమల, అక్టోబరు 24, 2020: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దయ, దుర్గ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ విజయాలు చేకూరాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులే అంతిమ విజయం సాధిస్తాయని మహిషాసురుడిపై దుర్గామాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రపంచం కరోన పై విజయం సాధించాలని, ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, సుఖ శాంతులు, సిరి సంపదలు చేకూరాలని శ్రీ సుబ్బారెడ్డి కోరారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.