VAIKUNTA EKADASI OBSERVED WITH RELIGIOUS FERVOUR IN ALL LOCAL TEMPLES OF TTD _ టీటీడీ స్థానిక ఆలయాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి

Tirupati, 25 December 2020: Spiritual fervour marked the Vaikuntha Ekadasi celebrations as all the local temples of TTD witnessed devout turn out on Friday.

In Srinivasa Mangapuram, the Vaikuntha Dwara Darshanam commenced at 4am and lasted till 7pm while at Sri Govindaraja Swamy temple, the temple activities began at 3:30am and closed at 9pm.

In other local temples including Sri Kodanda Rama Swamy temple, Appalayagunta the devotees had darshan from 4am to 8pm and 7:30am till 5pm respectively.

In Tiruchanoor, the daily routine started at 4:30am and concluded at 8pm.

Even in outside temples like Vontimitta, Upamaka, Narayanavanam, Nagulapuram, Karvetinagaram etc.the devotees had Vaikuntha Ekadasi darshanam.

TTD had made elaborate arrangements and observed Covid guidelines while providing darshan to pilgrims. The Vaikutha Dwaram arranged at Sriniavasa Mangapuram is a cynosure for the devotees who thronged in huge numbers.

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER, TIRUPATI 

టీటీడీ స్థానిక ఆలయాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి

తిరుపతి 25 డిసెంబరు 2020: టీటీడీకి చెందిన స్థానిక ఆలయాల్లో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగింది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉదయం 4.30 గంటల నుంచి, అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 4- గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రెండు ఆలయాల్లో రాత్రి 8 గంటల వరకు దర్శనం కొనసాగనుంది.

తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి ఆలయం, శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, ఉపమాక, ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం, నారాయణ వనం, కార్వేటినగరం,నాగలాపురం ఆలయాల్లో టీటీడీ కోవిడ్ 19 నిబంధనలు అమలు చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది